సన్నబడిన పూనమ్ కౌర్... సినిమా అవకాశాల కొసమేనా...

అప్పుడప్పుడు కొంతమంది హీరోయిన్లు ఒకట్రెండు సినిమాల్లో నటించిన తర్వాత అనుకోకుండా ఆహార డైట్ విషయంలో శ్రద్ధ తీసుకోకపోవడంతో బరువు పెరిగి ఫిట్నెస్ కోల్పోతుంటారు.ఈ క్రమంలో సినిమా అవకాశాలు కూడా దక్కించుకోలేక మళ్లీ సన్నబడడానికి జిమ్ వర్కవుట్లు, ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు, యోగా వంటివి చేస్తుంటారు.

 Heroine Poonam Kaur Weight Loss For Movie Offers-TeluguStop.com

అయితే తెలుగులో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ హీరోగా నటించిన “మాయాజాలం” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అయిన తెలుగు అమ్మాయి “పూనమ్ కౌర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఐతే పూనమ్ కౌర్ సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో చాలా నాజూగ్గా ఉంటూ తన అందచందాలతో కుర్రకారును గుండెలను పిండేసింది.

అయితే ఏమైందో ఏమో గాని అనుకోకుండా బరువు పెరిగి హీరోయిన్ గా సినిమా అవకాశాలను దక్కించుకోలేక పోయింది.దీంతో పలు చిత్రాల్లో గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలలో కూడా నటించేందుకు సిద్ధమైంది.

 Heroine Poonam Kaur Weight Loss For Movie Offers-సన్నబడిన పూనమ్ కౌర్… సినిమా అవకాశాల కొసమేనా…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 అయితే ఇటీవలే బరువు తగ్గాలని బలంగా నిర్ణయించుకున్న పూనం కౌర్ జిమ్ లో గంటల తరబడి శ్రమిస్తోంది.అంతే కాకుండా ప్రత్యేకంగా ఫిట్నెస్ ట్రైనర్ ని కూడా నియమించుకుని ఆహారపు అలవాట్ల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతోంది.

 కాగా తాజాగా పూనమ్ కౌర్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.దీంతో పూనమ్ మళ్ళీ నాజూకుగా తయారవుతుందని అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అంతేకాక మునుపటిలాగే హీరోయిన్ పాత్రలో నటించే అవకాశాలను దక్కించుకుని బాగా రాణించాలని కోరుకుంటున్నారు…

ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం పూనం కౌర్ చేతిలో కొత్త సినిమా అవకాశాలు ఏవీ లేవు.ఇటీవలే తమిళ ప్రముఖ  హీరో జితిన్ రమేష్ హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకున్నట్లు సమాచారం.అంతేగాక  తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మరో చిత్రంలో కూడా గెస్ట్ అప్పియరెన్స్ పాత్రలో నటిస్తున్నట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.కానీ ఇప్పటి వరకూ పూనమ్ కౌర్ మాత్రం ఈ విషయంపై స్పందించలేదు.

#PoonamKaur #Poonam Kaur #PoonamKaur #HeroinePoonam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు