టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల్లో వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్నారు పూజా హెగ్డే.గతేడాది అల వైకుంఠపురములో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పూజా హెగ్డే ప్రస్తుతం కోట్ల రుపాయల పారితోషికం తీసుకుంటున్నారు.
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూలో తన తొలి సంపాదన గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
కాలిగ్రఫీ నేర్చుకున్న పూజా హెగ్డే యొక్క చేతి రాత అందంగా ఉండేది.
తాత కోరిక మేరకు పూజా ముంబై అథ్లెటిక్ అసోసియేషన్ లో పాల్గొని అక్కడ విద్యార్థుల పేర్లను అందంగా రాసి ఆమె 200 రూపాయలు పారితోషికంగా పొందారు.ఆరోజు 200 రోజులు సంపాదించడంతో జాక్ పాట్ కొట్టినట్టు ఫీల్ అయ్యానని పూజా హెగ్డే చెప్పుకొచ్చారు.
అయితే తనకు చిన్నతనంలో సిగ్గు ఎక్కువగా ఉండేదని ఆమె తెలిపారు.

పబ్లిక్ ఈవెంట్లలో ఎక్కువగా పాల్గొనడం ద్వారా సిగ్గును అధిగమించాలని భావించిన పూజా హెగ్డే కెరీర్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ హీరోయిన్ గా సక్సెస్ అయ్యారు.మిస్ యూనివర్స్ పోటీలలో పూజా హెగ్డే సెకండ్ రన్నరప్ గా నిలవడంతో ఆమెకు యాడ్స్ లో నటించే అవకాశాలు ఎక్కువగా వచ్చాయి.మొదట్లో యాడ్ కోసం 3 వేల రూపాయల పారితోషికం అందుకున్న పూజా హెగ్డే ఆ తరువాత మిస్ యూనివర్స్ పోటీల్లో సెకండ్ రన్నరప్ గా నిలిచారు.
రణబీర్ కపూర్ తో ఒక యాడ్ లో కలిసి నటించానని ఆ యాడ్ తన లైఫ్ నే మార్చేసిందని పూజా తెలిపారు.మొహంజోదారో మూవీలో ఛాన్స్ రావడానికి కూడా ఆ యాడ్ కారణమని ఆమె వెల్లడించారు.
ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోకపోయినా పూజా హెగ్డే మాత్రం వరుస అవకాశాలతో బిజీ అయ్యారు.అయితే సినిమాల ద్వారా సంపాదించిన తొలి సంపాదనతో మాత్రం పూజా హెగ్డే కారు కొన్నారని సమాచారం.
.