విలన్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్! బిగ్ బాస్ భామ ప్రేమాయణం  

విలన్ ని పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ..

Heroine Pooja Ramachandran Married Tollywood Vilan-heroine Pooja Ramachandra,married Tollywood Vilan,south Cinema,tollywood

టాలీవుడ్ లోకి స్వామి రారా సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన పూజా రామచంద్రన్ అంటే అందరికి పెద్దగా తెలియకపోవచ్చు కాని బిగ్ బాస్ సీజన్ 2 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన పూజా అంటే వెంటనే అందరూ గుర్తు పట్టేస్తారు. బిగ్ బాస్ హౌస్ లో తన వచ్చి రాని తెలుగులో, అలాగే తన ఐడియాలజీతో అందరికి దగ్గరై తర్వాత కౌశల్ ఆర్మీ నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. కౌశల్ తో గొడవ పెట్టుకొని కౌశల్ ఆర్మీ దెబ్బకి హౌస్ నుంచి బయటకి వచ్చేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు పూజా తన ప్రేమికుడు విలన్ అనిష్ ని పెళ్లి చేసుకొని మారోసారి వార్తలలో నిలిచింది..

విలన్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్! బిగ్ బాస్ భామ ప్రేమాయణం -Heroine Pooja Ramachandran Married Tollywood Vilan

మొదటి భర్త నుండి విడాకులు తీసుకుని రెండేళ్లుగా సౌత్ సినిమాలలో విలన్ గా ఉన్న అనీష్ జాన్ తో రిలేషన్ షిప్ లో ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకుంటానంటే ఒక ఇంటర్వ్యూలో కూడా పూజా రామచంద్రన్ ప్రకటించింది. అన్నట్లుగానే కేరళ సాంప్రదాయ పద్దతిలో అనీష్ జాన్ ను పెళ్లి చేసుకుంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించిందినాకు ఇష్టమైన స్నేహితుడిని పెళ్లి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను అని పోస్ట్ చేసి తమ పెళ్లి ఫోటోలు కూడా షేర్ చేసింది. అనిష్ కి కోడా పూజాతో ఇది రెండో వివాహం కావడం విశేషం.