పూజాహేగ్దే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్  

Heroine Pooja Hegde Instagram Account Hacked -

అందాల భామలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటూ వారి గురించి ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు.అలాగే తమ హాట్ ఫోటో షూట్ లు షేర్ చేస్తూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు.

 Heroine Pooja Hegde Instagram Account Hacked

అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హ్యాకర్స్ కన్ను సెలబ్రిటీల మీద పడుతుంది.హ్యాకింగ్ సమస్యలు ఎక్కువగా ఉండే సోషల్ మీడియాలో హ్యాకర్స్ ఒక్కోసారి టైం పాస్ కోసం, లేదంటే ఇలిక్ట్ కంటెంట్, పోస్ట్ చేసి దానిని వైరల్ చేయడం కోసం సెలబ్రిటీల పేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ పేజీలని హ్యాక్ చేస్తూ ఉంటారు.

అయితే ఇలా హ్యాక్ అయిన విషయాన్ని సెలబ్రిటీలు కూడా ఏదో పొరపాటు జరిగేంత వరకు కూడా గుర్తించారు.అయితే ఇప్పుడు పూజా హెగ్డే ఈ విషయంలో కాస్తా ముందుగానే స్పందించింది.

పూజాహేగ్దే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్-Movie-Telugu Tollywood Photo Image

పూజా హెగ్డే సోషల్ మీడియా మాధ్యమమైన ఇంస్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయింది.ఈ విషయాన్ని గుర్తించి ఆమె వెంటనే తన ఫ్యాన్స్ ని అలెర్ట్ చేసింది.పూజా హెగ్డే ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.హాయ్ గైస్ నా ఇన్‌స్టా అకౌంట్ ఎవరో హ్యాక్ చేశారు.

ఈ విషయంపై నా డిజిటల్ టీమ్ నాకు సాయం చేస్తున్నారు.ఆ అకౌంట్ నుంచి వచ్చిన ఏ ఇన్విటేషన్స్ అక్సెప్ట్ చేయకండని, మీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన ఏ వివరాలను ఆ అకౌంట్‌ కి పంపించకండి అంటూ ట్వీట్ చేసి తన ఫ్యాన్స్‌కి సూచించింది.

మొత్తానికి పొరపాటు జరగక ముందే హ్యాక్ అయిన విషయాన్ని పూజా హెగ్డే గుర్తించి ఫ్యాన్స్ ని అలెర్ట్ చేయడం నిజంగా ముందుచూపు అని చెప్పాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Pooja Hegde Instagram Account Hacked Related Telugu News,Photos/Pics,Images..