సింగర్ సునీత కు హీరోయిన్ ఆఫర్..ఏ దర్శకుడు ఇచ్చాడో తెలుసా..?  

singer sunitha got heroine offer from this director, Heroine, Singer Sunitha, director , tollywood, rgv, acting - Telugu Acting, Director, Heroine, Rgv, Singer Sunita, Tollywood

తెలుగు ఇండస్ట్రీలో తన అద్భుతమైన గాత్రం ద్వారా ఎన్నో పాటలకు ప్రాణం పోసిన సింగర్ సునీత ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు.దీనికి గల కారణం ఆమె రెండో వివాహం చేసుకోవడమే.

TeluguStop.com - Heroine Offer To Singer Sunita Do You Know Which Director Gave It

తన మొదటి భర్తతో విడాకులు తీసుకున్న సునీత,డిజిటల్ మీడియా కంపెనీ అధిపతి అయిన రామ్ ని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసినదే.ఇంతవరకు సునీత సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, వ్యాఖ్యాతగా విధులు నిర్వహిస్తున్న ఈమెకు ఇప్పుడు మరి కొంత బాధ్యత పెరిగిందని చెప్పవచ్చు.

అయితే పెళ్లి తర్వాత తాజాగా ఓ చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సునీత తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

TeluguStop.com - సింగర్ సునీత కు హీరోయిన్ ఆఫర్..ఏ దర్శకుడు ఇచ్చాడో తెలుసా..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇంటర్వ్యూ సందర్భంగా సునీత తనకు హీరోయిన్ గా నటించడానికి అవకాశం వచ్చిందనే విషయాన్ని తెలియజేశారు.

గులాబీ సినిమాలో ఈ వేళలో నీవు అనే పాట పాడిన తర్వాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్కూల్ నుంచి హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చిందని సునీత తెలిపారు.అంతేకాకుండా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తనకు హీరోయిన్ అవకాశం కల్పించారని తెలియజేశారు.

కానీ నటన పై తనకి ఆసక్తి లేకపోవడం వల్ల ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదని, అప్పటికే సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి ఫామ్ లో ఉన్నానని ఈ సందర్భంగా సునీత తెలిపారు.

ఇండస్ట్రీకి దగ్గరగా ఉంటూ హీరోయిన్ లు పడే టెన్షన్ దగ్గరగా ఉండి చూడటం వల్ల ఆ రంగం వైపు వెళ్లడానికి ఆసక్తి చూపలేదని, అసలు నటన వైపు వెళ్లాలనే ఆలోచన కూడా తనకు లేదని ఈ సందర్భంగా తెలిపారు.ఒకవేళ ఇప్పుడు అవకాశాలు వస్తే నటిస్తారా? అని సునీతను అడగగా అదెలా సాధ్యమవుతుంది.నిజం చెప్పాలంటే నా జీవితంలో టెన్షన్స్ లేకుండా ఎంతో తృప్తిగా బ్రతకడానికి ఇష్టపడతా అంటూ ఈ సందర్భంగా ఆమె తెలిపారు.

#Heroine #Acting #Singer Sunita #Director

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు