తెలుగులో యంగ్ హీరో నాగచైతన్య హీరోగా నటించిన “సవ్య సాచి” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమలోకి హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “నిధి అగర్వాల్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే నాగ శౌర్య వంటి స్టార్ హీరో చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకోవడంతో టాలీవుడ్ లో దాదాపుగా సినీ కెరియర్ సెటిల్ అయ్యింది.
కానీ మిస్టర్ మజ్ను చిత్రంతో ఫ్లాప్ వెంటాడినప్పటికీ “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో మాత్రం చాలా హైప్ వచ్చింది.దీంతో ప్రస్తుతం ఈ అమ్మడి సినీ కెరియర్ బాగానే ఊపందుకుంది.
అంతేకాకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, సినీ పరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ రాణిస్తోంది.
కాగా తాజాగా నటి నిధి అగర్వాల్ కు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఆ ఫోటో ఒకసారి పరిశీలించినట్లయితే నిధి అగర్వాల్ చిన్నప్పుడు సాంప్రదాయ దుస్తులను ధరించిన సమయంలో తీసినట్లు తెలుస్తోంది.కాగా ఈ ఫోటోని ఇటీవలే ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
దీంతో ఈ ఫోటోపై కొందరు అధికారులు స్పందిస్తూ చిన్నప్పుడు నిధి అగర్వాల్ చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే నిధి అగర్వాల్ తమిళంలో ప్రముఖ హీరో “జయం రవి” హీరోగా నటించిన “భూమి” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనిపించింది.కాగా ప్రస్తుతం “నిధి అగర్వాల్” తెలుగులో పవర్ స్టార్ “పవన్ కళ్యాణ్” మరియు ప్రముఖ విలక్షణ దర్శకుడు “క్రిష్ జాగర్లమూడి” కాంబినేషన్లో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు” చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పనులలో హైదరాబాద్ నగరంలోని రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతంలో జరుగుతున్నట్లు సమాచారం.ఏదేమైనప్పటికీ సినిమా పరిశ్రమకు వచ్చిన అనతి కాలంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుందంటే మామూలు విషయం కాదని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.