నయనతార సినిమా షూటింగ్ స్పాట్ లో సునామి.. కొన్ని రోజులపాటు వనికిపోయిన లేడీ సూపర్ స్టార్?

సాధారణంగా ఒక సినిమా షూటింగ్ చేయాలంటే ఆ సినిమాను బట్టి ఎన్నో అద్భుతమైన లొకేషన్లను ఎంపిక చేసుకుంటారు దర్శకనిర్మాతలు.ఈ సమయంలోనే కొన్ని సన్నివేశాలను కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను, యాక్షన్ సన్నివేశాలను,పాటలను చిత్రీకరించడం కోసం దర్శకనిర్మాతలు ఎక్కువగా విదేశాలకు వెళ్లడం లేదా ఏదైనా సముద్ర తీరాలలో, అటవీ ప్రాంతాలలో షూటింగ్ లను చేస్తుంటారు.

 Heroine Nayanthara Shares Terrible Incident While Shooting In Phuket Island Deta-TeluguStop.com

ఇలా ప్రమాదకరమైన ప్రదేశాలలో షూటింగ్ చేసే సమయంలో కొన్ని సార్లు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి.ఇలాంటి ప్రమాదాలు జరగడం వల్ల కొన్ని సార్లు కొందరు ప్రాణాలను కోల్పోయిన వారు కూడా ఉన్నారు.

అయితే ఊహించని విధంగా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని చెప్పవచ్చు.అయితే ఇలాంటి అనుభవం మన లేడీ సూపర్ స్టార్ నయనతారకు ఎదురైందని ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే తనకు వణుకు పడుతుందని ఈమె తెలిపారు.

ఇంతకీ ఆ భయంకరమైన సంఘటన ఏమిటి అనే విషయానికి వస్తే.సాధారణంగా ఇతర దేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు కొన్ని ప్రాంతాలు కొందరు సెలబ్రిటీలను ఎంతగానో ఆకట్టుకుంటాయి.

అలా నయనతారకు పుకెట్ దివి అంటే ఎంతో ఇష్టమైన ప్రదేశం అని ఈమె చెబుతున్నారు.

Telugu Nayanthara, Lady, Nayatara, Phuket Island, Terrible, Tollywood, Tsunami-M

ఇలా ఒక సినిమా షూటింగ్ నిమిత్తం ఈ దీవికి వెళ్ళినప్పుడు ఆ రోజు మొత్తం ఆ దీవిలో షూటింగ్ జరుపుకొని తిరిగి హోటల్ కి వచ్చాము.హోటల్ కి వచ్చిన తర్వాత ఆదీవి గురించి ఒక భయంకరమైన విషయం తెలియడంతో తనకు ఎంతో భయం వేసిందని అసలు విషయాన్ని వెల్లడించారు.పుకేట్ దీవికి దగ్గరగా ఉన్నటువంటి దీవిలో భయంకరమైన సునామీ రావడంతో ఆదీవి మొత్తం మునిగిపోయిందని, ఆ సునామీ ప్రభావం పుకేట్ దీవి పై కూడా పడిందని తెలియడంతో నయనతార ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు.

ఆ సునామీ ఒక రెండు గంటల ముందు వచ్చి ఉంటే నేను ఏమైపోయే దాన్ని అని తలుచుకొని ఈమె ఎంతో భయపడిందని, కొన్ని రోజుల పాటు ఆ భయం నుంచి బయటపడలేక పోయానని నయనతార ఒక సందర్భంలో వెల్లడించారు.

Telugu Nayanthara, Lady, Nayatara, Phuket Island, Terrible, Tollywood, Tsunami-M

ఇలా ప్రమాదం జరిగినా కూడా తనకు ఆ దీవిలో షూటింగ్ జరుపుకోవడం అంటే ఎంతో ఇష్టమని ఈ లేడీ సూపర్ స్టార్ తనకు ఇష్టమైన ఈ దీవి గురించి వెల్లడించారు.ఈ విధంగా నయనతార తన జీవితంలో జరిగిన అత్యంత భయంకరమైన విషయాన్ని ఈ సందర్భంగా వెల్లడించారు.ఇకపోతే ప్రస్తుతం ఈ లేడీ సూపర్ స్టార్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఒకవైపు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు చెల్లెలి పాత్రలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు.తాజాగా ఈ లేడీ డాన్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టి నిర్మాతగా కూడా పలు చిత్రాలను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube