మహేష్ తో పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పడానికి అసలు కారణమిదే?

టాలీవుడ్ క్యూట్ జోడీలలో మహేష్ బాబు నమ్రత జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.మహేష్ బాబు నమ్రత కాంబినేషన్ లో తెరకెక్కిన వంశీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

 Heroine Namrata Says Good Bye To Mahesh Babu Movie Details Here Mahesh Babu, Namrata ,tollywood, Manjula, Vamshi Movie-TeluguStop.com

అయితే ఆ సినిమా సమయంలో ప్రేమలో పడిన మహేష్ నమ్రత నిజ జీవితంలో ప్రేమలో పడి అందరికీ షాకిచ్చారు.న్యూజిలాండ్ లో వంశీ మూవీ షూటింగ్ జరగగా ఆ సమయంలో మహేష్ నమ్రతల ప్రేమ బంధం పెళ్లి బంధంగా మారేంత బలపడింది.

మొదట నమ్రత మహేష్ పై తనకు ఉన్న ఇష్టాన్ని వెల్లడించారు.మహేష్ కు కూడా అప్పటికే నమ్రతపై పాజిటివ్ ఒపీనియన్ ఉంది.

 Heroine Namrata Says Good Bye To Mahesh Babu Movie Details Here Mahesh Babu, Namrata ,tollywood, Manjula, Vamshi Movie-మహేష్ తో పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పడానికి అసలు కారణమిదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదట మహేష్ నమ్రతలపెళ్లికి నమ్రత కుటుంబం ఒప్పుకున్నా మహేష్ కుటుంబం మాత్రం ఒప్పుకోలేదు.మహేష్ బాబు సోదరి మంజుల మహేష్ నమ్రతల పెళ్లికి కుటుంబ సభ్యులను ఒప్పించారని సమాచారం.2005 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన చాలా సింపుల్ గా మహేష్ బాబు నమ్రతల వివాహం జరిగింది.మహేష్ నమ్రత నాలుగు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్నా ఆ విషయాలు ఎక్కడా లీక్ కాకపోవడం గమనార్హం.

పెళ్లి తర్వాత నమ్రత సినిమాలకు దూరంగా ఉన్నారు.బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వచ్చినా ఆ ఆఫర్లకు నమ్రత నో చెప్పారు.

వయసులో మహేష్ బాబు కంటే నమ్రత పెద్ద కావడం గమనార్హం.ఒక ఇంటర్వ్యూలో నమ్రత మాట్లాడుతూ తనకు టాప్ హీరోయిన్ కావాలనే కోరిక ఎప్పుడూ లేదని అన్నారు.

Telugu Bye, Mahesh Babu, Manjula, Namrata, Tollywood, Vamshi-Movie

మహేష్ బాబును పెళ్లి చేసుకోవాలని అనుకున్న సమయంలోనే సినిమాలను వదులుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.మహేష్ ఫ్యామిలీ కోసం ఏదైనా చేస్తారని ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తారని నమ్రత అన్నారు.మహేష్ గొప్ప మానవతావాది అని ఈ రీజన్ వల్లే నాకు మహేష్ అంటే ప్రేమ, ఆరాధన అని నమ్రత తెలిపారు.మహేష్ బాబును పెళ్లి చేసుకోవడం అత్యంత ప్రత్యేకమైన బహుమతి అని నేను భావిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube