తనకు చేతబడి చేశారంటున్న బాలయ్య 'ఆదిత్య 369' హీరోయిన్!

బాలకృష్ణ హీరోగా, మోహిని హీరోయిన్ గా తెరకెక్కిన ఆదిత్య369 సినిమా ఎలాంటి విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించిన మోహిని ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించారు.

 Heroine Mohini About Her Life Incidents-TeluguStop.com

సుమారు 100 చిత్రాలకు పైగా నటించిన మోహిని తాజాగా తన నిజ జీవితంలో జరిగిన కొన్ని ఆశ్చర్యకర సంఘటనను అభిమానులతో పంచుకున్నారు.ఈ క్రమంలోనే తన జీవితం ఎంతో సుఖంగా సాగిపోతున్న క్రమంలో తనకు ఎవరో చేతబడి చేశారంటూ నటి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమాల తర్వాత వైవాహిక జీవితంలో స్థిరపడిన తనకు పెళ్లయిన ఐదు సంవత్సరాల వరకు తన వైవాహిక జీవితం ఎంతో అద్భుతంగా, సంతోషంగా సాగిపోయిందని తెలిపారు.పెళ్లి తర్వాత ఐదు సంవత్సరాలకు తనలో తనకు తెలియని మార్పులు చోటు చేసుకున్నాయని, ఒక మానసిక వేదన తనను వెంటాడుతూ ఉండేదని, ఈ క్రమంలోనే తాను ఏం చేస్తున్నానో కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నానని తెలిపారు.

 Heroine Mohini About Her Life Incidents-తనకు చేతబడి చేశారంటున్న బాలయ్య ఆదిత్య 369’ హీరోయిన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిపారు.

నిత్యం దైవ దర్శనాలు, అమ్మవారి పూజ చేస్తే తనకు పూజ చేయడానికి మనసుపోయేది కాదు.

ఇలాంటి సందిగ్ధంలో ఉన్న తనకు ఒక జ్యోతిష్యుని పిలిపించి ఏం జరిగిందోనని అడగగా అప్పుడు జ్యోతిష్యుడు తనకు చేతబడి జరిగిందని, చేతబడి జరిగే ఐదు సంవత్సరాలు కావడంతో వారు ఏమి చేయలేమని.తనని కేవలం భగవంతుడు మాత్రమే రక్షించగలడని చెప్పారు.

భగవంతుడు అంటే ఎవరు? ఎవరు నన్ను రక్షించేది అన్న సందిగ్ధంలో ఉండిపోయాను.అసలు భగవంతుడు వచ్చి నన్ను ఎలా కాపాడుతాడు అంటూ సందిగ్ధంలో ఉండి ధ్యానం చేస్తుండగా.

తనకు కలలో ఏసుక్రీస్తు కనిపించాడని చెప్పారు.

Telugu Adityaram, Heroine Mohini, Kalakrishna, Mollywood-Movie

ఈ క్రమంలోనే ఓ పెద్ద ప్రళయంలో నేను కొట్టుకు పోతుంటే ఏసుప్రభు తన వంక నవ్వుతూ చూసి నిన్ను కాపాడుతానని చెప్పినట్లు తెలిపారు.ఆ తర్వాత నేను పడుతున్న ఈ సమస్య నుంచి బయట పడ్డానని, తనను రక్షించినది ఆ దేవుడు ఏసు ప్రభు అని తెలుసుకున్నాను.ఈ క్రమంలోనే ఒక పాస్టర్ తన ఇంటికి వచ్చి ప్రార్థనలు చేశాడు.

ఆ సమయంలో నేను 13 యాసలతో మాట్లాడుతున్నాను.నేను మాట్లాడే ప్రతి మాట నాకు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే నేను ఈ అమ్మాయిని వదిలి వెళ్ళిపోతున్నాను అనే మాటలు వినిపించాయి.ఈ విధంగా ఏసుప్రభు నన్ను కాపాడాడని నటి మోహిని తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి తెలిపారు.

#Kalakrishna #Heroine Mohini #Mollywood #Adityaram

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు