బ్రేకప్ బాధ ఏమాత్రం లేని మెహ్రీన్.. బీచ్ లో ఆడుతూ అలా..!

టాలీవుడ్ హీరోయిన్ గా కొనసాగుతున్న మెహ్రీన్ కౌర్ సడెన్ గా హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం తెలిసిందే.నేడో రేపో పెళ్లి ముహుర్తం తో వస్తారనుకున్న ఈ జంట బ్రేకప్ తో షాక్ ఇచ్చింది.

 Heroine Mehreen Kaur Enjoying After Engagement Breakup, Bhavya Bhishnoi, Breakup-TeluguStop.com

మెహ్రీన్, భవ్య భిష్ణోయ్ బ్రేకప్ కు కారణం ఏంటన్నది తెలియదు కాని ఇద్దరు ఎవరి దారి వారు చూసుకున్నారు.ఎక్కడ తేడా కొట్టిందో ఏమో కాని వ్యవహారం బాగానే దెబ్బ తిన్నదని తెలుస్తుంది.

పెళ్లి తర్వాత మెహ్రీన్ సినిమాలు చేయకూడదు అనే కండీషన్ నచ్చకనే ఆమె భవ్య భిష్ణోయ్ తో పెళ్లి క్యాన్సల్ చేసుకుందని అంటున్నారు.

బ్రేకప్ తర్వాత మెహ్రీన్ అసలేమాత్రం బాధ లేకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.

లేటెస్ట్ గా బీచ్ లో ఆడుతూ ఉన్న పిక్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది మెహ్రీన్ కౌర్. మ్యారేజ్ క్యాన్సల్ అవడం వల్ల తాను బాధగా లేనని సంతోషంగానే ఉన్నానని చెప్పేలా ఆమె బీచ్ లో సరదాగా ఆడుతున్నట్టు ఉంది.

ఇక సినిమాల విషయానికి వస్తే అనీల్ రావిపుడి ఎఫ్3లో నటిస్తున్న అమ్మడు మారురిత్ డైరక్షన్ లో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న వెబ్ సీరీస్ లో కూడా అమ్మడు నటిస్తుందని తెలుస్తుంది.బ్రేకప్ తర్వాత సినిమాల విషయంలో మరింత స్పీడ్ అందుకుంది మెహ్రీన్.

మరి ఇదే జోరు మునుముందు కూడా కొనసాగిస్తుందేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube