జూనియర్ మిల్కీ బ్యూటీ ఆశలన్నీ ఆ ఒక్క సినిమాపైనే

మిల్కీ బ్యూటీ తమన్నాకు చెల్లి మాదిరిగా ఉండే మెహ్రీన్ తెలుగు లో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా తో హీరోయిన్ గా తెలుగు వాళ్లకు పరిచయం అయిన ఈ పంజాబీ ముద్దుగుమ్మ కెరీర్‌ ఆరంభంలో మంచి సినిమాలు చేసి హిట్స్‌ దక్కించుకున్నా కూడా ఆ తర్వాత తర్వాత ఈమె సినిమాల ఎంపిక విషయంలో తప్పిదం జరిగింది.

 Heroine Mehreen All Hops On Anil Ravipudi F3 Movie , Heroine , Mehreen , Anil Ra-TeluguStop.com

కొన్ని సినిమాలు ఈమెకు సక్సెస్ ను ఇచ్చినా కూడా స్టార్ డమ్‌ ను మాత్రం తీసుకు రావడంలో విఫలం అయ్యాయి.

అందుకే మెహ్రీన్‌ కెరీర్ ఆమద్య డౌన్ ఫాల్‌ అయ్యింది.

ఆస మయంలో ఆమె పెళ్లికి సిద్దం అయ్యింది.నిశ్చితార్థం కూడా జరిగింది.

కాని అనూహ్యంగా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.సినిమా మొదలు కాకుండానే ప్లాప్ అయినట్లుగా మెహ్రీన్ పెళ్లి ముచ్చట మూడు నాళ్ల ముచ్చట అన్నట్లుగా అయ్యింది.

పెళ్లి జరిగినా వీరిద్దరు విడిపోయే వారు… కనుక ముందే విడిపోవడం మంచిది అయ్యిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Telugu Anil Ravipudi, Manchirojulu, Mehreen, Tamanna, Venkatesh-Movie

మెహ్రీన్‌ పెళ్లి క్యాన్సిల్‌ అయిన తర్వాత మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అందులో భాగంగానే రోజులు మారాయి అనే సినిమాను చేసింది.మారుతి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని ఆమె ఆశించింది.

కాని బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా బొక్క బోర్ల పడింది.ఇప్పడు ఈమె నటిస్తున్న ఏకైక తెలుగు సినిమా ఎఫ్‌ 3.

ఈ సినిమాపైనే ఆమె ఆశలు అన్ని పెట్టుకుంది.తెలుగు లో మళ్లీ బిజీ అవ్వాలంటే ఈ సినిమా ను సక్సెస్ చేసుకోవాల్సిందే.

అనీల్‌ రావిపూడి ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునేలా ఈ సినిమాను తెరకెక్కిస్తాడు అనే నమ్మకం ఉంది.ఎఫ్ 2 సక్సెస్‌ అయ్యింది కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంటుంది.

కాని ఈ విజయం మెహ్రీన్ కు ఉపయోగదాయకంగా ఉంటుందా లేదా అనేది చూడాలి.తమన్నా రేంజ్ లో ఇండస్ట్రీని మరి కొంత కాలం ఏలాలి అంటే ఈ అమ్మడికి ఎఫ్‌ 3 సూపర్‌ హిట్‌ ను అందించాలి.

మరి ఎఫ్ 3 తో ఈమె కెరీర్‌ ఎంతగా మారుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube