ఆ పని చేసి కంటతడి పెట్టించిన స్టార్ హీరోయిన్ మీనా.. ఏం జరిగిందంటే?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన మీనా భర్త విద్యాసాగర్ ఊపిరితిత్తుల సమస్య వల్ల మృతి చెందిన సంగతి తెలిసిందే.గత కొన్ని నెలలుగా లంగ్స్ ఇన్ఫెక్షన్ తో విద్యాసాగర్ బాధ పడుతుండగా కరోనా సోకిన తర్వాత సమస్య మరింత తీవ్రమైంది.

 Heroine Meena Shocking Decision After Husband Death Details, Meena, Heroine Meena, Meena Husband Death, Vidyasagar, Nainika, Vidyasagar Cremations, Meena Emotional, Heroine Meena Family, Rajnikanth, Sharath Kumar-TeluguStop.com

కరోనా నుంచి కోలుకున్నా పోస్ట్ కోవిడ్ సమస్యల వల్ల విద్యాసాగర్ ఇబ్బందులు పడ్డారు.అయితే భర్త మరణం తర్వాత మీనా చేసిన పని కంటతడి పెట్టించింది.

మీనా విద్యాసాగర్ దంపతులకు ఒక కూతురు కాగా కొడుకులు లేరనే సంగతి తెలిసిందే.భర్త అంత్యక్రియలకు అన్నీ తానై మీనా వ్యవహరించారు.ఇంటి వెలుపల భర్త దహన సంస్కారాలను మీనా నిర్వహించారు.భర్త అంత్యక్రియలకు సంబంధించిన అన్ని పనులను మీనా చేయడంతో అంత్యక్రియలలో పాల్గొన్న వాళ్లు కంటతడి పెట్టుకున్నారు.

 Heroine Meena Shocking Decision After Husband Death Details, Meena, Heroine Meena, Meena Husband Death, Vidyasagar, Nainika, Vidyasagar Cremations, Meena Emotional, Heroine Meena Family, Rajnikanth, Sharath Kumar-ఆ పని చేసి కంటతడి పెట్టించిన స్టార్ హీరోయిన్ మీనా.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఎప్పుడూ నవ్వుతూ అమాయకంగా కనిపించే మీనాకు ఊహించని కష్టం వచ్చిందని నెటిజన్లు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిన్న భర్త మరణవార్త విని మీనా శోకసంద్రంలో మునిగిపోయారు.

Telugu Meena, Nainika, Rajnikanth, Sharath Kumar, Vidyasagar-Movie

రజనీకాంత్, శరత్ కుమార్ మరి కొందరు సినీ ప్రముఖులు మీనాను ఓదార్చారు.మీనా ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.వెంకటేష్, మీనా కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో ఎక్కువ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.దృశ్యం, దృశ్యం2 సినిమాలతో వెంకటేష్, మీనాలకు మంచి పేరు వచ్చిందనే సంగతి తెలిసిందే.

Telugu Meena, Nainika, Rajnikanth, Sharath Kumar, Vidyasagar-Movie

మీనా కూతురు నైనిక కూడా పలు తమిళ సినిమాలలో నటించి పాపులారిటీని మరింత పెంచుకున్నారు.మీనా భవిష్యత్తులో సినిమాల్లో కొనసాగుతారో లేదో చూడాల్సి ఉంది.కూతురిని గొప్ప హీరోయిన్ ను చేయాలని మీనా భావిస్తున్నట్టు తెలుస్తోంది.తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ హీరోలకు జోడీగా మీనాకు ఆఫర్లు వస్తున్నాయి.మీనా కొంతకాలం పాటు సినిమాలకు దూరం కానున్నారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube