దొంగతనాలు చేయడం ఇష్టమంటున్న రవితేజ హీరోయిన్!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా తెరకెక్కిన నేల టికెట్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాళవిక శర్మ.ఆ సినిమాలో మాళవిక నటనకు మంచి మార్కులే పడినా సినిమా డిజాస్టర్ ఫలితాన్ని అందుకోవడంతో టాలీవుడ్ హీరోలు ఈ హీరోయిన్ కు ఛాన్సులు ఇవ్వలేదు.

 Heroine Malavika Sharma Says She Loves Doing Petty Thefts, Red Movie Heroine, M-TeluguStop.com

చాలా కాలం తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న రెడ్ సినిమాలో హీరోయిన్ గా మాళవిక శర్మకు ఛాన్స్ వచ్చింది.త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మాళవిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన గురించి ఎవరికీ తెలియని ఎన్నో కొత్త విషయాలను అభిమానులకు చెప్పుకొచ్చారు.చిన్నప్పటి నుంచి తనకు లాయర్ కావాలనే కోరిక ఉండేదని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే లా చదువుకుంటున్నానని మాళవిక చెప్పారు.

తనది ముంబై అని తెలుగు సినిమాల్లో ఆఫర్లు వస్తూ ఉండటంతో తెలుగు భాషను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.

పాకెట్ మనీ కోసం మోడల్ గా కెరీర్ ప్రారంభించానని సంతూర్, హిమాలయ లాంటి ప్రముఖ బ్రాండ్ల ప్రకటనలలో కూడా తాను నటించానని మాళవిక చెప్పుకొచ్చారు.

డ్యాన్స్, ట్రావెలింగ్ తనకు ఎంతో ఇష్టమని.ఖాళీ సమయం దొరికితే ఏదో ఒక ప్రదేశానికి వెళతానని తెలిపారు.

తనకు తొలి సినిమాలో కనీసం అడిషన్ కూడా తీసుకోకుండా ఛాన్స్ ఇచ్చారని అలా ఛాన్స్ ఇవ్వడాన్ని తాను ఎప్పటికీ మరిచిపోలేనని అన్నారు.

తనకు దొంగతనాలు చేయడం చాలా ఇష్టమని చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ ఉంటానని మాళవిక తెలిపారు.

విలువైనవి దొంగలించను కానీ ఎక్కడికి వెళ్లినా ఏదో ఒక వస్తువును తన వెంట తెచ్చుకుంటానని చెప్పారు.అయితే చిన్నచిన్న దొంగతనాలు చాలానే చేసినా ఒక్కసారి కూడా తాను పట్టుబడలేదని అన్నారు.

కొన్నిసార్లు బాగా అలసిపోతానని అలాంటి సమయంలో కనీసం వారం రోజులు రెస్ట్ తీసుకుంటానని చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube