మాధవీ లత : నన్ను తిట్టే వాళ్ళకి చాలా మంది తండ్రులు ఉంటారు…  

Madhavi Latha, Telugu heroine, BJP, Social media, Abusive comments , madhavi latha Response on Abusive Comments - Telugu Abusive Comments, Bjp, Madhavi Latha, Madhavi Latha Response On Abusive Comments, Social Media, Telugu Heroine

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావడంతో సెలబ్రిటీలకి మరియు అభిమానులకు మధ్య ఉన్నటువంటి దూరం బాగా తగ్గి పోయింది.దీంతో కొంత మంది సెలబ్రెటీలు తమ హావ భావాలను సోషల్ మీడియా మాధ్యమాలలో వ్యక్త పరుస్తుంటారు.

 Heroine Madhavi Latha Fires On Abusive Comments

అయితే ఈ విషయం నచ్చని వారు వారిని దారుణంగా ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తుంటారు.

అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లత ఇటీవలే వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి చేసినటువంటి వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ అప్పట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై చేసినటువంటి వ్యాఖ్యలు సరికాదని తన అధికారిక ఫేస్ బుక్  ద్వారా ఓ  పోస్ట్ ని షేర్ చేసింది.

మాధవీ లత : నన్ను తిట్టే వాళ్ళకి చాలా మంది తండ్రులు ఉంటారు…-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో కొందరు మాధవీలత పై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అసభ్య పదజాలం ఉపయోగిస్తూ కామెంట్  చేస్తూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

దీంతో ఈ విషయంపై మాధవీలత తాజాగా స్పందించింది.

 ఇందులో భాగంగా తన పై మరియు తన కుటుంబ సభ్యులపై ఇలా అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ కామెంట్లు చేసేటువంటి వారికి చాలా మంది తండ్రులు ఉంటారని, వెళ్లి వారి తండ్రి ఎవరో డీఎన్ఏ పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవాలని ఘాటుగా సమాధానం ఇచ్చింది.

దీంతో మాధవీ లత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతున్నాయి.

అంతేగాక ఈ విషయంపై స్పందించిన కొందరు నెటిజన్లు అవగాహన లేనటువంటి కొందరు అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ సెలబ్రిటీల పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని సైబర్ క్రైమ్ పోలీసులు కోరుతున్నారు.

#Madhavi Latha #Social Media #Bjp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Heroine Madhavi Latha Fires On Abusive Comments Related Telugu News,Photos/Pics,Images..