టాలీవుడ్ కు మరో కొత్త హీరోయిన్.. ఘనంగా వెల్కమ్!

టాలీవుడ్ లో ప్రెజెంట్ యంగ్ హీరోలు చాలా మంది ఉన్నారు.వారిలో టాలెంటెడ్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ విష్ణు ఒకరు.

 Heroine Locked For Sree Vishnu Next Details, Sree Vishnu, Reba Monica John, Ram-TeluguStop.com

ఈయన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు చేసాడు.అయినా కూడా ఇంత వరకు కెరీర్ కు క్లిక్ అయ్యే ఒక్క సినిమా కూడా ఈయనకు పడలేదు.

దీంతో టాలెంట్ ఉన్నప్పటికీ ఈ హీరో రేసులో వెనకబడి పోయారు.

ఇక తాజాగా శ్రీ విష్ణు ”అల్లూరి” సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించాడు.

ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో శ్రీవిష్ణు నటించాడు.ఈ సినిమా సెప్టెంబర్ 23న రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది.

రిలీజ్ ముందు కూడా భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా శ్రీ విష్ణు సినిమాల్లో పర్వాలేదు అనిపించింది.

ఇక ఈ సినిమా తర్వాత శ్రీ విష్ణు పలు ఇంట్రెస్టింగ్ సినిమాలతో సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తో ఆసక్తిగా మరిన్ని ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు.ఈ క్రమంలోనే అల్లూరి తర్వాత శ్రీ విష్ణు కొత్త సినిమా ప్రకటించాడు.ఈ కొత్త ప్రాజెక్ట్ టాలీవుడ్ లోని ప్రముఖ బ్యానర్ ఏకే ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హాస్య మూవీస్ తో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించగా ఈ సినిమాపై అందరి ద్రుష్టి పడింది.

Telugu Reba John, Ram Abbaraju, Reba Johan, Sree Vishnu, Tollywood-Movie

ఇక ఈ సినిమాను దర్శకుడు రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేయనున్నాడు.ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ మేకర్స్ ఇచ్చారు.ఈ సినిమా హీరోయిన్ ఎవరు అనేది అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.

యంగ్ హీరోయిన్ రెబా మోనికా జాన్ అనే కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుంటున్నట్టు చెబుతూ పోస్టర్ ద్వారా వెల్కమ్ చెప్పారు.ఇక ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తుండగా.

రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube