అమ్మ అయినా ఇంకా అమ్మాయినే అనుకుంటుందా?  

Heroine Laya Refused To Act Mother Character-heroine Laya,mother And Aunty Roles,refused To Act,తెలుగు అమ్మాయి,లయ

తెలుగు సినిమా పరిశ్రమలో ప్రస్తుతం చాలా మంది సీనియర్‌ హీరోయిన్స్‌ అమ్మగా అక్కగా అత్తగా పాత్రలు చేస్తూ కెరీర్‌లో మళ్లీ బిజీ అయ్యారు.ఇంకా పలువురు హీరోయిన్స్‌ కూడా అదే దారిలో నడిచేందుకు ఆసక్తిగా ఉన్నారు.కొందరు మాత్రం గతంలో హీరోయిన్‌గా నటించి ఇప్పుడు ఎందుకు అమ్మగా అక్కగా చేయాలంటూ ప్రశ్నిస్తున్నారు.సినిమాలో ఏదైనా ముఖ్యమైన పాత్ర ఉంటే చేస్తాం తప్ప అమ్మ పాత్రను మాత్రం చేయమంటూ ఒకరు ఇద్దరు హీరోయిన్స్‌ చెబుతున్నారు.

Heroine Laya Refused To Act Mother Character-heroine Laya,mother And Aunty Roles,refused To Act,తెలుగు అమ్మాయి,లయ Telugu Tollywood Movie Cinema Film Latest News-Heroine Laya Refused To Act Mother Character-Heroine Mother And Aunty Roles Refused తెలుగు అమ్మాయి లయ

వారిలో లయ ఒకరు.

తెలుగు అమ్మాయి అయిన లయ చాలా కాలం పాటు తెలుగు సినిమాల్లో నటించింది.తెలుగు అమ్మాయిల్లో చివగా ఎక్కువ కాలం హీరోయిన్‌గా నటించింది ఎవరు అంటే ఠక్కున వినిపించే పేరు లయ.ఆమె తర్వాత మరెవ్వరు కూడా ఎక్కువ కాలం కంటిన్యూ అవ్వలేదు.

లయ ప్రస్తుతం నటిగా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యింది.కాని ఆమె మాత్రం అత్తగా అమ్మగా నటించేందుకు ఆసక్తి చూపడం లేదు.కేవలం ముఖ్య పాత్రలు మాత్రమే చేస్తానంటూ భీష్మించుకు కూర్చుంది.

అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రంలో ఈమె పోషించి పాత్ర ఏమాత్రం ఆకట్టుకోలేదు.అమ్మగా అయినా అత్తగా అయినా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు.

అలాంటి పాత్రలు వదిలేసి ఇంకా తాను అమ్మాయినే అనుకుని అమ్మ పాత్రలకు నో చెబుతున్న ఈమె గురించి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.పెళ్లి అయ్యి పిల్లలు ఉన్నారు నాలుగు పదుల వయసు దగ్గరకు వచ్చింది.ఇలాంటి సమయంలో ఇంకా కూడా అత్త పాత్రలకు నో చెప్పడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు.