అలా కనిపించడానికి చాలా కష్టపడ్డా : లావణ్య త్రిపాఠి

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమై స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోలేకపోయినా వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు లావణ్య త్రిపాఠి.లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల 5వ తేదీన విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో లావణ్య త్రిపాఠి పాల్గొని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Heroine Lavanya Tripati Comments About A1 Express Movie, A1 Express, Bike D-TeluguStop.com

ఇప్పటివరకు తాను గ్లామర్ రోల్స్ లో, పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో నటించానని ఆ పాత్రలు బాగా బోర్ కొట్టాయని లావణ్య తెలిపారు.

కొత్త తరహా పాత్రల్లో నటించాలని భావిస్తున్న తరుణంలో హీరో సందీప్ ముంబైలో తనను కలిసి తమిళంలో హిట్ అయిన నట్ పే తునే రీమేక్ గా తెరకెక్కుతున్న ఏ1 ఎక్స్ ప్రెస్ కథ చెప్పారని కథ నచ్చడంతో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని ఆమె అన్నారు.

కొంతమంది ఆటగాళ్లకు టాలెంట్ ఉన్నా కొందరు చేసే పాలిటిక్స్ వల్ల అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని ఈ సినిమాలో ఆటల వెనుక ఉన్న రాజకీయ కోణాలను ఆవిష్కరిస్తామని లావణ్య తెలిపారు.

Telugu Express, Bike, Hockey, Lavanya Tripati, Nat Pe Tupe-Movie

ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హాకీ ప్లేయర్ గా కనిపించబోతున్నానని ఎంతో కష్టపడి ఈ పాత్రలో నటించానని తెలిపారు.చిన్నప్పటి నుంచి ఆటలు బాగా ఆడేదానినని ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ కోసం హాకీ నేర్చుకున్నానని ఆమె తెలిపారు.ఈ మూవీ కోసం హాకీ లైవ్ మ్యాచ్ లను చూడటంతో పాటు హాకీ ప్లేయర్స్ హావభావాలను గమనించేదానినని ఆమె అన్నారు.

సినిమాలో మేకప్ లేకుండా నటించానని లావణ్య చెప్పారు.

ఏ1 ఎక్స్ ప్రెస్ మూవీ కోసం బైక్ డ్రైవింగ్ నేర్చుకోవడంతో పాటు షూటింగ్ జరిగినన్ని రోజులు శారీరకంగా ఎంతో శ్రమించానని లావణ్య తెలిపారు.

సందీప్ తనకు ఎప్పటినుంచో మంచి ఫ్రెండ్ తమిళంలో సందీప్ తో కలిసి గతంలో ఒక సినిమాలో నటించానని లావణ్య త్రిపాఠి వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube