వరుణ్ తేజ్ తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన లావణ్య.. ఏం చెప్పారంటే?

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు తక్కువే అయినా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వచ్చాయనే సంగతి తెలిసిందే.గతంలో వరుణ్ తేజ్ ఒక సందర్భంలో లావణ్య త్రిపాఠికి ప్రపోజ్ చేయడానికి మరో ప్రాంతానికి వెళ్లనున్నారని ప్రచారం జరిగింది.

 Heroine Lavanya Tripati Clarity About Marriage Rumours Details Here , Lavanya Tripati , Marriage Rumours , Lavanya Tripathi Comment , Shocking Facts , Varun Tej ,happy Birthday Movie-TeluguStop.com

వార్తలపై డైరెక్ట్ గా స్పందించి క్లారిటీ ఇవ్వడానికి లావణ్య త్రిపాఠి అస్సలు ఇష్టపడలేదు.

అయితే లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో తెరకెక్కిన హ్యాపీ బర్త్ డే మరో రెండు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది.

 Heroine Lavanya Tripati Clarity About Marriage Rumours Details Here , Lavanya Tripati , Marriage Rumours , Lavanya Tripathi Comment , Shocking Facts , Varun Tej ,Happy Birthday Movie-వరుణ్ తేజ్ తో పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన లావణ్య.. ఏం చెప్పారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ పేరు ఎత్తకుండానే కామెంట్లు చేయడం గమనార్హం.ఒక హీరోను నేను పెళ్లి చేసుకుంటానని వార్తలు ప్రచారంలోకి వచ్చాయని అయితే ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు.

నాకు పెళ్లి జరగలేదని పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని ఆమె తెలిపారు.

నేను ప్రస్తుతం సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నానని లావణ్య త్రిపాఠి కామెంట్ చేశారు.

నాపై చాలా ప్రెజర్ ఉందని ఆమె కామెంట్ చేశారు.ప్రెజర్ ను తగ్గించుకోవడం కోసం నేను ఔటింగ్ కు, వెకేషన్స్ కు వెళతానని పర్వాతారోహణ చేస్తానని లావణ్య త్రిపాఠి కామెంట్ చేశారు.

పెళ్లి చేసుకునే సమయం వస్తే కచ్చితంగా చేసుకుంటానని ఆమె తెలిపారు.స్టార్ డైరెక్టర్ రాజమౌళి నా తొలి సినిమాను ప్రజెంట్ చేశాడని ఆమె చెప్పుకొచ్చారు.

రాజమౌళి హ్యాపీ బర్త్ డే ట్రైలర్ రిలీజ్ కు రావడం సంతోషాన్ని కలిగిస్తోందని ఆమె కామెంట్లు చేశారు.రాజమౌళి, ఆయన టీమ్ నాలో పాజిటివ్ ఎనర్జీని నింపారని లావణ్య త్రిపాఠి పేర్కొన్నారు. సర్రికల్ ప్రపంచంలో హ్యాపీ బర్త్ డే మూవీ సాగుతుందని ఆ సినిమా చాలా యూనిక్ గా ఉంటుందని ఆమె పేర్కొన్నారు.లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube