కన్నతండ్రి వల్ల నరకం అనుభవించిన ఖుష్బూ. ఏం జరిగిందంటే..?

తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాలు చేసినప్పటికీ పాపులారిటీ ఉన్న నటీమణుల్లో ఖుష్బూ ఒకరనే సంగతి తెలిసిందే.తెలుగు సినిమాలతో పాటు తమిళ సినిమాలలో కూడా నటించి నటిగా ఖుష్బూ మంచి పేరును సొంతం చేసుకున్నారు.

 Heroine Kushboo Shocking Comments About Her Father Behavior, Bad Behavior, Her F-TeluguStop.com

తమిళనాడులో ఖుష్బూకు అభిమానులు ఏకంగా గుడిని కట్టారంటే ఆమెను అభిమానించే అభిమానులు ఏ స్థాయిలో ఉన్నారో సులువుగానే అర్థమవుతుంది.

తెలుగులో ఈ మధ్య కాలంలో ఖుష్బూ నటించిన అజ్ఞాతవాసి సినిమా ఫ్లాప్ కావడంతో ఆమె తెలుగులో ఎక్కువ సంఖ్యలో ఆఫర్లతో బిజీ కాలేకపోయారు.

తెలుగుతో పోలిస్తే తమిళంలో ఎక్కువగా నటించిన ఖుష్బూ ఒక సందర్భంలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అని చెప్పుకొచ్చారు.అయితే ఈ నటి తన తండ్రి వల్ల ఎన్నో కష్టాలు అనుభవించారని సమాచారం.1986 సంవత్సరం సెప్టెంబర్ 12వ తేదీన మరిచిపోలేని నిర్ణయం తీసుకున్నానని ఆమె అన్నారు.

Telugu Bad Behavior, Khushboo, Break Car, Kushboo, Kollywod, Tollywood-Movie

ఖుష్బూను తండ్రి ఇష్టం వచ్చిన విధంగా తిట్టేవారు.ఖుష్బూ షూటింగ్ లో ఉన్న సమయంలో ఆమెను తండ్రి కొట్టేవారని సమాచారం.తండ్రి వల్ల ఖుష్బూకు కొన్ని సినిమా ఆఫర్లు కూడా మిస్ అయ్యాయి.

కొన్నిసార్లు కూతురు రెమ్యునరేషన్ ను కూడా ఆమె అనుమతి లేకుండా తీసుకుని ఖుష్బూ తండ్రి ఖర్చు చేసేవారు.ఖుష్బూ కొత్త కారును కొనుక్కోగా ఆ కారు విండ్ షీల్డ్ ను సైతం ఖుష్బూ తండ్రి పగులగొట్టారు.

Telugu Bad Behavior, Khushboo, Break Car, Kushboo, Kollywod, Tollywood-Movie

ముంబాయికి తీసుకొని వెళ్లమని తనను అడుక్కుంటావని తండ్రి చెప్పగా రైలు కింద పడి చనిపోతానేమో కానీ నీ దగ్గరకు మాత్రం రానని ఖుష్బూ తండ్రికి సమాధానమిచ్చారు.అప్పటినుంచి ఇప్పటివరకు తండ్రి గురించి తెలుసుకోవడానికి కూడా ఖుష్బూ ఇష్టపడలేదు.తండ్రి ప్రవర్తన బాగుండదని అందుకే తండ్రికి దూరంగా ఉంటున్నానని చాలా సందర్బాల్లో ఖుష్బూ చెప్పుకొచ్చారు.తండ్రిని చూడాలని కూడా తాను అనుకోనని ఆమె వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube