ప్రభాస్ ఆదిపురుష్.. సీత పాత్రలో మహేష్ హీరోయిన్..?  

బాహుబలి, బాహుబలి 2 సినిమాల విజయాలతో టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది.బాహుబలి సిరీస్ సినిమాల విడుదలకు ముందు ప్రభాస్ సినిమాల బడ్జెట్ 50 కోట్లకు అటూఇటుగా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా అప్పీల్ ఉన్న కథలను ఎంచుకోవడంతో పాటు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఉన్న కథలను మాత్రమే ప్రభాస్ ఎంపిక చేసుకుంటున్నారు.

TeluguStop.com - Heroine Kritisanon Finalized For Prabhas Aadipurush Movie

గతేడాది ప్రభాస్ నటించిన సాహో సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లు వచ్చాయి.

ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమాలో నటిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

TeluguStop.com - ప్రభాస్ ఆదిపురుష్.. సీత పాత్రలో మహేష్ హీరోయిన్..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు.దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్న ఈ సినిమా 2022 ఆగష్టు నెలలో విడుదల కానుంది.

ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపించనుండగా సీత పాత్రకు చాలామంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి.అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం మేరకు 1 నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించిన కృతి సనన్ సీత పాత్రలో నటించనుందని సమాచారం.మొదట సీత పాత్రకు కైరా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి.కానీ చివరకు కృతిసనన్ ను ఫైనల్ చేశారని తెలుస్తోంది.

గతంలో సీత పాత్రలో కృతిసనన్ నటిస్తున్నట్టు వార్తలు వైరల్ కాగా చివరకు ఆ వార్తలే నిజమయ్యాని సమాచారం.ఒకటి రెండు రోజుల్లో ఈ మేరకు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఈ సినిమాలో రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తుండగా బాలీవుడ్ నటుడు సన్నీ సింగ్ ఈ సినిమాలో లక్ష్మణుడి పాత్రకు ఎంపికైనట్లు తెలుస్తోంది.

#Seetha Role

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు