పిక్ టాక్ : బేబమ్మ మరీ ఇంతలా మారిందేంటబ్బా

ఉప్పెన సినిమా తో హీరోయిన్‌ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ కృతి శెట్టి తెలుగు లో ఈమెకు అదే మొదటి సినిమా.పదహారు ఏళ్ల కృతి శెట్టిని చూసి అంతా కూడా వావ్‌ అనుకున్నారు.

 Heroine Krithy Shetty New Look In Red Dress Details, Bebeamma, Krithi Shetty, Mo-TeluguStop.com

ఉప్పెన సినిమా లో బేబమ్మ పాత్రను ఆమె పండించిన తీరు అద్బుతం అనడంలో సందేహం లేదు.ఆమె ఆ ఒక్క సినిమా తో అరడజను సినిమా లను తన ఖాతా లో వేసుకుంది.

అద్బుతమైన నటన కూడా తన సొంతం అవ్వడం వల్ల కృతి కి వరుసగా ఆఫర్లు వస్తున్నాయి.చిన్న వయసులోనే స్టార్‌ డమ్ దక్కించుకున్న కృతి శెట్టి తన అందంను కాపాడుకునేందుకు చాలానే కష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఉప్పెన సినిమాలో సన్నగా నాజూకు గా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు కాస్త లావు అయినట్లుగా అనిపిస్తుంది.

తాజాగా కృతి శెట్టి ఫొటో షూట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నెట్టింట ఈమద్య కాలంలో హీరోయిన్స్ రెగ్యులర్ గా తమ ఫొటోలను వీడియో లను షేర్‌ చేస్తూ ఉంటారు.కాని కృతి శెట్టి మాత్రం చాలా రేర్ గా మాత్రమే తన ఫొటో షూట్‌ ను చేస్తూ వస్తోంది.

తెలుగు లో ఈ అమ్మడు చేస్తున్న సినిమా ల ప్రమోషన్ కోసం వరుసగా ఫొటో షూట్స్ ను ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది.తాజాగా ఒక మాల్‌ ఓపెనింగ్‌ కు వెళ్లిన సమయంలో కూడా అక్కడ కృతి కనిపించింది.

ఆ సమయంలో బేబమ్మ కాస్త లావు అయ్యిందే అనిపించేలా ఆమె కనిపించింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.నెట్టింట ప్రచారం జరుగుతున్న కృతి శెట్టి బరువు అంశం ప్రస్తుతం అందరిలో కూడా చర్చ మొదలు అయ్యింది.ప్రస్తుతం ఈమె రామ్‌ పోతినేని మరియు బంగార్రాజు సినిమా ల్లో హీరోయిన్‌ గా నటిస్తుంది.ఇంకా పలు సినిమా లకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయనే వార్తలు వస్తున్నాయి.

ఈ సమయంలో ఆమె తన బరువు విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube