షాకింగ్ నిర్ణయం తీసుకున్న కృతి శెట్టి.. అసలు విషయం తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు!

ఉప్పెన సినిమాతో బేబమ్మగా కుర్రాళ్ళ హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. ఈ ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.

 Heroine Krithi Shetty To Do Social Service With Nishna Foundartion On Occasion Of Her Birthday Details, Kriti Shetty ,bebamma ,uppena Movie,nishna - Feed The Need, Heroine Krithi Shetty , Krithi Shetty Social Service ,nishna Foundartion , Krithi Shetty Birthday-TeluguStop.com

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.

కృతి శెట్టి సినీ ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది.దీంతో ఈ అమ్మడి తన క్రేజ్ ను ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది.

 Heroine Krithi Shetty To Do Social Service With Nishna Foundartion On Occasion Of Her Birthday Details, Kriti Shetty ,Bebamma ,Uppena Movie,Nishna - Feed The Need, Heroine Krithi Shetty , Krithi Shetty Social Service ,nishna Foundartion , Krithi Shetty Birthday-షాకింగ్ నిర్ణయం తీసుకున్న కృతి శెట్టి.. అసలు విషయం తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అంతేకాకుండా కొన్ని సీరియల్ ప్రకటనలో, జువెలరీ ప్రకటనలో కూడా మెరిసింది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

ఇటీవలే దివారియర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో సక్సెస్ తన ఖాతాలో వేసుకుంది.

అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా పరిచయమై మంచి క్రేజ్ తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.

కానీ ఇప్పుడు ఈమెను దర్శకులు పట్టించుకోవటం లేదని తెలుస్తుంది.ముఖ్యంగా ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అని ముద్ర కూడా పడింది.దీంతో ఆమెకు అవకాశాలు వస్తాయో రావో అనే ఆలోచనలు ఉన్నాయి.

ఇదంతా పక్కన పెడితే కృతి శెట్టి తాజాగా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది.ఇంతకు అదేంటంటే.

తన పుట్టినరోజు సందర్భంగా పేదవారికి సహాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది.

కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి అతి చిన్న వయసులో గొప్ప మనసు చాటుకుంది కృతి శెట్టి.

నిష్న – ఫీడ్ ది నీడ్ అనే పేరుతోఎన్టీవో ను ప్రారంభించింది కృతి.ఇక తన తల్లిదండ్రుల పేరు మీదుగా ఈ సంస్థను ప్రారంభించినట్టు తెలుస్తుంది.ఇక ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలిపింది.కష్టాల్లో ఉన్న వారికి ఏదైనా సహాయం చేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

అందరూ తమ సంస్థకు అండగా నిలవాలి అని.తన బర్త్డే సందర్భంగా తన అభిమానులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించగా వారికి కృతజ్ఞతలు తెలుపుతుంది.ఇక ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేపట్టాలని తెలిపింది.ఇక తను ఎన్టిఓ తరుపున పేదలకు అవసరమైన సరుకులను, దుస్తులు ఇతర సామాగ్రిలను అందించినట్లు తెలిపింది.

ఇక ఇబ్బందుల్లో ఉన్న పేదలు తమను సంప్రదిస్తే తమకు తోచిన సాయం చేస్తామని తెలిపింది.ఇక ఈమె తీసుకున్న నిర్ణయానికి సినీ ప్రముఖులతో పాటు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఎంత గొప్ప మనసు అని తనను పొగుడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube