ఆ అవతారాలల్లో కనిపించిన కృతి శెట్టి.. నీలో మస్తు షేడ్స్ ఉన్నాయి బేబమ్మ అంటూ ట్రోల్స్?

ఖాళీ సమయం దొరికినప్పుడల్లా హీరోయిన్స్ బాగా ఫోటో షూట్ లు చేయించుకుంటూ వాటిని షేర్ చేస్తూ సోషల్ మీడియాలో బాగా కాలక్షేపం చేస్తున్నారు.కొన్ని కొన్ని సార్లు అప్డేట్ ఫిల్టర్లతో కూడా ఫొటోస్ దిగుతూ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఫొటోస్ పంచుతూ ఉంటారు.

 Heroine Krithi Shetty Avatars Pics Viral On Social Media Details, Kriti Shetty ,-TeluguStop.com

కానీ ట్రోలర్స్ మాత్రం వారి నుంచి అలా చేసి ఏదో ఒక కామెంట్ చేస్తూ ఉంటారు.తాజాగా మరో హీరోయిన్ కూడా అటువంటి ఫోటోలు పంచుకోవడంతో కొన్ని ట్రోల్స్ ఎదుర్కొంది.

ఎందుకు ఆమె ఎవరంటే.కృతి శెట్టి.

ఉప్పెన సినిమాతో బేబమ్మ పాత్రతో మంచి క్రేజ్ సంపాదించుకొని కుర్రాళ్ళ హృదయాలను దోచుకున్న ముద్దుగుమ్మ కృతి శెట్టి. మొదటి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ గా మారి స్టార్ హీరోల దృష్టిలో కూడా పడింది.

అతి తక్కువ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.తన అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బాగా బిజీగా ఉంది.

కృతి సినీ ఇండస్ట్రీకి బుల్లితెరపై బాలనటిగా అడుగుపెట్టి ఎన్నో వాణిజ్య ప్రకటనలలో నటించింది.  ఈ అమ్మడి తన క్రేజ్ ను ఏకంగా హీరోయిన్ వరకు సంపాదించుకుంది.కొన్ని సీరియల్ ప్రకటనలో, జువెలరీ  ప్రకటనలో కూడా చేస్తూ మరింత డిమాండ్ సంపాదించుకుంది.

ప్రస్తుతం కృతి శెట్టి ఓ వైపు సినిమాలే కాకుండా మరో వైపు ప్రకటనలో కూడా బాగా దూసుకుపోతుంది.

ప్రస్తుతం వరుస సినిమాలతో అవకాశాలు రావడంతో కోటి రూపాయల పారితోషకం డిమాండ్ చేసింది.

అతి చిన్న వయసులోనే హీరోయిన్ గా పరిచయమై మంచి క్రేజ్ తో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక సోషల్ మీడియాలో మాత్రం నిత్యం ఏదో ఒక పోస్టు తో బాగా హల్ చల్ చేస్తుంది.

ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఫోటో షూట్ లంటూ తెగ సందడి చేస్తుంది.

ఇక ఈ అమ్మడు తన ఇన్ స్టా లో కూడా ఏదో ఒక పోస్ట్ తో అందరి దృష్టిలో పడుతుంది.తన వ్యక్తిగత విషయాలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.పైగా డాన్స్ వీడియో లను బాగా షేర్ చేసుకుంటుంది.ఇదిలా ఉంటే తాజాగా తన ఇన్ స్టాలో కొన్ని ఫోటోలు పంచుకుంది.అయితే ఆ ఫోటోలో ఈ మధ్య వస్తున్న అవతార్ ఫిల్టర్స్ ద్వారా తన ఫోటోలను ఎడిట్ చేసింది.

ఇక ఆ ఫోటోలను చూసిన తన అభిమానులు బాగా లైక్స్ కొడుతున్నారు.

అందంగా ఉన్నావ్ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు.ఇక కొందరు మాత్రం ట్రోల్స్ చేస్తూ ఉన్నారు.

ఇప్పటికే ఈమె టెన్త్ క్లాస్ స్టూడెంట్ అంటూ చాలా ట్రోల్స్ చేశారు.ఇక తాజాగా మరోసారి తనకు ట్రోల్స్ ఎదురయ్యాయి.

ఆ ఫోటోలలో రకరకాల షెడ్లతో కనిపించిన కృతి శెట్టి చాలావరకు అందంగా కనిపించింది.అయితే ఓ నెటిజన్.

నీలో మస్తు షేడ్స్ ఉన్నాయి బేబమ్మ అంటూ కామెంట్ పెట్టగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube