15 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ సుందర్.. ఎలా తగ్గారంటే?

Heroine Khusboo Sundar Losses 15 Kg Weight Her Fans In Shock

బరువు తగ్గడం సాధారణ విషయం కాదు.ఎక్కువ బరువు ఉండటం వల్ల చాలామందిని అనేక ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి.

 Heroine Khusboo Sundar Losses 15 Kg Weight Her Fans In Shock-TeluguStop.com

కొంతమంది బరువు తగ్గడం కోసం వ్యాయామాలపై ఆధారపడుతుంటే మరి కొందరు సర్జరీలు చేయించుకుని బరువు తగ్గుతుండటం గమనార్హం.కొన్ని నెలల క్రితం వరకు బొద్దుగా ఉన్న ఖుష్బూ స్లిమ్ లుక్ లోకి మారిపోవడంతో పాటు మరింత అందంగా కనిపిస్తున్నారు.

ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న ఖుష్బూ సుందర్ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు.రాజకీయాల్లో కూడా ఖుష్బూ సుందర్ సక్సెస్ కావాలనే ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు.

 Heroine Khusboo Sundar Losses 15 Kg Weight Her Fans In Shock-15 కిలోల బరువు తగ్గిన నటి ఖుష్బూ సుందర్.. ఎలా తగ్గారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలకు మాత్రమే ఖుష్బూ సుందర్ ఓకే చెబుతుండగా తాజాగా సోషల్ మీడియాలో ఖుష్బూ షేర్ చేసిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.

ఖుష్బూ సుందర్ తన పాత ఫోటోతో పాటు కొత్త ఫోటోను పంచుకోవడంతో పాటు 15 కేజీల బరువు తగ్గానని ఖుష్బూ చెప్పుకొచ్చారు.

నెటిజన్లు ఖుష్బూ అప్పుడూ ఇప్పుడూ అందంగానే ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు.బరువు తగ్గి ఖుష్బూ ఇతరులకు స్పూర్తిగా నిలుస్తున్నారని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.వ్యాయామం చేయడం ద్వారా ఖుష్బూ సుందర్ బరువు తగ్గినట్టు తెలుస్తోంది.

గతంలో ఖుష్బూ డైట్ ను నియంత్రణలో ఉంచుతున్నానని ప్రతిరోజూ వ్యాయామం చేస్తున్నానని చెప్పుకొచ్చారు.శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అన్నాత్తే సినిమాలో ఖుష్బూ సుందర్ నటిస్తున్నారు.ఖుష్బూ సుందర్ కొత్త లుక్ ను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

 లాక్ డౌన్ సమయంలో 70 రోజుల పాటు ఖుష్బూ సుందర్ సొంతంగా ఇంటి పనులు చేసుకున్నారు.  అందంగా కనిపించడానికి ఖుష్బూ సుందర్ ఇంటి చిట్కాలను ఎక్కువగా పాటిస్తుండటం గమనార్హం.

 ఫిట్ గా, హెల్తీగా ఉంటూ తన ఫోటోలతో ఖుష్బూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.

#Khusboo #Annatthe #Khusboo Diet #Fans #Khusboo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube