ఆ సినిమా ఏడేళ్ల కల అంటున్న కీర్తి సురేష్..?  

heroine keerthy suresh interesting comments about vaashi movie-sandalwood-tollywood-keerthi suresh-vaashi movie-since seven years-instagram post-mahesh babu - Telugu Interesting Comments, Keerthi Suresh, Suresh Kumar, Vaashi Movie

మలయాళంలో బాలనటిగా కెరీర్ ను మొదలుపెట్టిన కీర్తి సురేష్ నేను శైలజ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు.రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన నేను శైలజ సినిమా నటిగా కీర్తికి మంచి పేరు తెచ్చిపెట్టింది.

TeluguStop.com - Heroine Keerthy Suresh Interesting Comments About Vaashi Movie

ఆ తరువాత కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన నేను లోకల్, మహానటి సినిమాలు కూడా హిట్ కావడం ఆమె కెరీర్ కు ప్లస్ అయింది.ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సర్కార్ వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.

పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హిట్టైతే మాత్రం కీర్తి సురేష్ స్టార్ హీరోల సినిమాల్లో వరుస అవకాశాలతో బిజీ అయ్యే అవకాశం ఉంది.మహానటి మినహా కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోవడంతో ఆమె ఫ్యాన్స్ కూడా స్టార్ హీరోల సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలని కీర్తి సురేష్ కు సూచనలు చేస్తున్నారు.గ్లామర్ పాత్రల కంటే అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల ద్వారానే కీర్తి గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

TeluguStop.com - ఆ సినిమా ఏడేళ్ల కల అంటున్న కీర్తి సురేష్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా కీర్తి సురేష్ వాషి అనే సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా ద్వారా తన ఏడు సంవత్సరాల కల నెరవేరబోతుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మలయాళంలో ఈ సినిమా తెరకెక్కుతుండగా టొవినో థామస్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తున్నారు.విష్ణు జీ రాఘవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు కీర్తి సురేష్ తల్లిదండ్రులు రేవతి, కీర్తిసురేష్ నిర్మాతలుగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.

ప్రముఖ నటుడు మోహన్ లాల్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.వాషి సినిమా గురించి కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ వాషి సినిమా తన హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా అని అన్నారు.

తండ్రి నిర్మాణంలో తెరకెక్కే సినిమాలో హీరోయిన్ గా నటించడం అంత తేలిక కాదని.ఈ సినిమా చేయడానికి ఏడు సంవత్సరాలు పట్టిందని.

ఏడు సంవత్సరాలకు తన కల సాకారం కాబోతుందని కీర్తి సురేష్ వెల్లడించారు.

#Suresh Kumar #Keerthi Suresh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు