పెళ్లికి నాన్న ఒప్పుకోలేదు.. కాజోల్ సంచలన వ్యాఖ్యలు..?- Heroine Kajol Sensational Comments About Marriage

heroine kajol sensational comments about her father,bollywood,kajai,ajay hdevagan,thribanga,love marrige,cine industry,father,real life,cinema pramotion,renuka - Telugu About Her Father, Heroine Kajol, Sensational Comments, Tribhanga Movie

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు పెళ్లైనా, పెళ్లి కాకపోయినా కెరీర్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు.అయితే కొంతమంది హీరోయిన్లకు మాత్రం పెళ్లైన తరువాత గతంతో పోలిస్తే అవకాశాలు తగ్గుతుంటాయి.

 Heroine Kajol Sensational Comments About Marriage-TeluguStop.com

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు పెళ్లి చేసుకోవడం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటారు.తాజాగా నటి కాజోల్ అజయ్ దేవగణ్ తో పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కాజోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న త్రిభంగ్ సినిమా విడుదల కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజోల్ మాట్లాడుతూ తన జీవితానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.రియల్ లైఫ్ లో స్త్రీ పురుషుడు అనే బేధం లేకుండానే తాను పెరిగానని సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలో 24 వ ఏట అజయ్ దేవగణ్ ను పెళ్లి చేసుకుంటానని తన తండ్రికి చెప్పానని కానీ ఆయన ఒప్పుకోలేదని పెళ్లి చేసుకోకుండా కొన్నాళ్లు సినిమాల్లోనే నటించాలని సూచించారని పేర్కొన్నారు.

 Heroine Kajol Sensational Comments About Marriage-పెళ్లికి నాన్న ఒప్పుకోలేదు.. కాజోల్ సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu About Her Father, Heroine Kajol, Sensational Comments, Tribhanga Movie-Movie

అయితే తండ్రి ఒప్పుకోకపోయినా తల్లి మాత్రం పెళ్లికి అంగీకరించదని మనస్సు మాట వినమని తల్లి సూచించిందని అన్నారు.ఆ తరువాత తాను అనుకున్న విధంగా అజయ్ దేవగణ్ ను పెళ్లి చేసుకున్నానని పెళ్లి విషయంలో చుట్టుపక్కల వారి మద్దతు తనకు లభించిందని కాజోల్ అన్నారు.త్రిభంగ సినిమా గురించి మాట్లాడుతూ మూడు తరాల మహిళలకు జరిగిన ఘటనల నేపథ్య కథతో ఈ సినిమా తెరకెక్కిందని కాజోల్ చెప్పారు.

ప్రేమను, ద్వేషాన్ని లోతుగా చూసే అను అనే పాత్రలో తాను ఈ సినిమాలో నటిస్తానని కాజోల్ చెప్పుకొచ్చారు.

రేణుకా సహానే డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజోల్ ఒడిస్సీ నృత్యకారిణిగా నటించి మెప్పించారు.కాజోల్ తన పెళ్లి గురించి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#Heroine Kajol

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు