కాజల్ సంచలన నిర్ణయం.. అలాంటి సినిమాలకు గుడ్ బై..?

లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్.మునుపటితో పోలిస్తే క్రేజ్ తగ్గినా కాజల్ కు వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

 Heroine Kajal Agarwal Good Bye To Glamorous Roles Movies, Lakshmi Kalyanam, Busi-TeluguStop.com

కెరీర్ మొదట్లో యంగ్ హీరోలతో మాత్రమే నటించిన కాజల్ గత కొన్నేళ్ల నుంచి సీనియర్ స్టార్ హీరోలతో కూడా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.

పాత్రకు ప్రాధాన్యత ఉంటే కొత్త హీరోలతో, పెద్దగా గుర్తింపు లేని హీరోలతో నటించడానికి కూడా కాజల్ అంగీకరిస్తోంది.

అయితే కెరీర్ మొదట్లో గ్లామరస్ పాత్రల్లో నటించిన కాజల్ పెళ్లి తరువాత మాత్రం అలాంటి పాత్రల్లో నటించకూడదని నిర్ణయం తీసుకుందని సమాచారం.లాక్ డౌన్ సమయంలో ముంబైకి చెందిన బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ పెళ్లి తరువాత కూడా వరుసగా సినిమాల్లో నటిస్తోంది.

Telugu Acharya, Chiranjeevi, Bye, Indian, Kajal Agarwal, Mosagallu-Latest News -

ప్రస్తుతం ఆచార్య సినిమాలో చిరంజీవికి జోడీగా నటిస్తున్న కాజల్ అతి త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతుంది.ఈ సినిమాతో పాటు కాజల్ భారతీయుడు 2, మోసగాళ్లు సినిమాల్లో నటిస్తోంది.పెళ్లి తరువాత కాజల్ ఒక హర్రర్ సినిమాలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.అయితే పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని గ్లామర్ పాత్రలకు దూరంగా కాజల్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

దర్శకులు మంచి కథతో వస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సైతం నటించాలని కాజల్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత ఎలాంటి సినిమాలను ఎంచుకుంటుందో కాజల్ అగర్వాల్ సైతం అలాంటి కథలనే ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాజల్ ప్రస్తుతం కొత్త కథలను వింటున్నారని వరుస షూటింగులతో బిజీ కానున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube