పెళ్లి తర్వాత కూడా మారని కాజల్.. ఏం జరిగిందంటే..?

సాధారణంగా సినిమా రంగంలో పెళ్లి తర్వాత హీరోయిన్లకు ఆఫర్లు తగ్గుతాయనే సంగతి తెలిసిందే.కానీ కాజల్ అగర్వాల్ విషయంలో అందుకు భిన్నంగా జరుగుతోంది.

 Heroine Kajal Agarwal Doing Movies With Jet Speed After Marriage-TeluguStop.com

సీనియర్ స్టార్ హీరోల సినిమాలతో పాటు యంగ్ హీరోల సినిమాల్లో, వెబ్ సిరీస్ లలో కాజల్ కు ఆఫర్లు వస్తున్నాయి.ఒకవైపు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తూనే కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లలో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల షూటింగ్ లను కాజల్ అగర్వాల్ వేగంగా పూర్తి చేస్తున్నారు.జెట్ స్పీడ్ లో ఈ హీరోయిన్ సినిమాల్లో నటిస్తుండటం గురించి తెలిసి ఆమె అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

 Heroine Kajal Agarwal Doing Movies With Jet Speed After Marriage-పెళ్లి తర్వాత కూడా మారని కాజల్.. ఏం జరిగిందంటే..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆచార్య సినిమాలో కాజల్ అగర్వాల్ చిరంజీవికి జోడీగా నటించనుండగా నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు సైతం కాజల్ అగర్వాల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం.

Telugu Acharya, Goshti, Gowtham Kichlu, Kajal Agarwal, Kajal And Nagarjuna Movie, Kajal In Acharya, Kajal In Indian 2 Movie, Kajal Movies After Marriage, Kamal Haasan, Movies With Jet Speed, Nagarjuna Movie-Movie

ఈ సినిమాతో పాటు ఇండియన్ 2 సినిమాలో కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు.కోలీవుడ్ లో కాజల్ అగర్వాల్ ఇటీవల గోష్టి అనే సినిమాలో నటించారు.రాజకీయ నేపథ్యంకు సంబంధించిన కథతో ఈ సినిమా కథ తెరకెక్కింది.

కేవలం 90 రోజుల్లోనే కాజల్ అగర్వాల్ ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేయడం గమనార్హం.అందం, అభినయం పుష్కలంగా ఉన్న కాజల్ అగర్వాల్ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు.

మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కాజల్ అగర్వాల్ భర్త గౌతమ్ కిచ్లుతో దిగిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.కాజల్ అగర్వాల్ భర్త బిజినెస్ లను కూడా ప్రమోట్ చేస్తుండటం గమనార్హం.

భర్త గౌతమ్ కిచ్లు యొక్క వ్యాపారాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఆ వ్యాపారాలు సక్సెస్ అయ్యేందుకు కాజల్ అగర్వాల్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

#Kamal Haasan #Kajal Agarwal #Gowtham Kichlu #KajalAnd #KajalMovies

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు