సాధారణంగా హీరోయిన్లు సినిమాలలో ఆఫర్లు తగ్గిన తరువాత గ్యాప్ తీసుకుని అక్క, అమ్మ, వదిన తరహా పాత్రలతో రీఎంట్రీ ఇస్తారు.అయితే కాజల్ అగర్వాల్ మాత్రం ఒకవైపు హీరోయిన పాత్రల్లో నటిస్తూనే సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు కోలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న కాజల్ అగర్వాల్ పనిమనిషి కొడుకు కోసం ఏకంగా టీచర్ లా మారిపోయారు.రియల్ లైఫ్ లో ఆమె ఇంగ్లీష్ టీచర్ అవతారం ఎత్తారు.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఎప్పుడూ బిజీగా ఉండే హీరోహీరోయిన్లు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడిన సంగతి తెలిసిందే.కరోనా ఫస్ట్ వేవ్ టైమ్ లో తనను తాను విశ్రాంతి లేకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించానని కాజల్ అన్నారు.
బిజీగా ఉండటం ద్వారా నిరాశ, నిస్పృహలను తాను దరి చేయనీయలేదని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.సెకండ్ వేవ్ లో మాత్రం తనకు ఖాళీగా ఉండాల్సిన అవసరం రాలేదని ఆమె చెప్పుకొచ్చారు.

ఆ కారణం వల్లే తాను సెకండ్ వేవ్ లో టీచర్ గా మారడంతో పాటు పనిమనిషి కొడుకుకు పాఠాలను బోధించానని ఆమె అన్నారు.కరోనా సెకండ్ వేవ్ వల్ల విద్యార్థులు చాలా నష్టపోయారని కాజల్ అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.తన ఇంటి దగ్గర ఉండే విద్యార్థులలో చాలామంది విద్యార్థులు చదువు లేక ఇంటికే పరిమితమయ్యారన్న విషయాన్ని తాను తెలుసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

అందరికీ తాను చదువు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి కనీసం పనిమనిషి కొడుకుకు అయినా చదువు చెప్పాలని భావిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.లాక్ డౌన్ ను ఎత్తివేయడంతో సాధారణ జీవితంలో అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె చెప్పుకొచ్చారు.గతంలో ఒంటరిగా షూటింగ్ లకు వెళ్లేదానినని ప్రస్తుతం గౌతమ్ తో కలిసి వెళుతున్నానని కాజల్ తెలిపారు.