టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు.టాలీవుడ్ హీరోయిన్లలో అతికొద్దిమంది మాత్రమే ఈ రికార్డును కలిగి ఉండటం గమనార్హం.
కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ తో మగధీర, నాయక్ సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే.రామ్ చరణ్ నటించిన ఎవడు సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ తో కలిసి నటించిన కాజల్ అగర్వాల్ ఆయన తండ్రి చిరంజీవితో కూడా ఖైదీ నంబర్ 150, ఆచార్య సినిమాల్లో కలిసి నటించారు.
నాగచైతన్య హీరోగా నటించిన దడ సినిమాలో కాజల్ చైతన్యకు జోడీగా నటించిన సంగతి తెలిసిందే.
తండ్రికి జోడీగా నటించిన కాజల్ అగర్వాల్ నాగార్జున ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తూ ఉండటం గమనార్హం.ఇలా చిరంజీవి, నాగార్జునలతో కలిసి నటిస్తూ ఉండటంతో పాటు చైతన్య, చరణ్ లతో కూడా నటించి కాజల్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
ఒకప్పుడు యంగ్ హీరోలతో మాత్రమే నటించిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం అవకాశాలు తగ్గిన నేపథ్యంలో సీనియర్ స్టార్ హీరోలతో కూడా నటిస్తున్నారు.టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత వల్ల కాజల్ అగర్వాల్ కు వరుసగా ఆఫర్లు కూడా వస్తున్నాయి.
రేపు కాజల్ అగర్వాల్ నటించిన మోసగాళ్లు సినిమా విడుదల కానుంది.ఈ సినిమా హిట్టైతే కాజల్ అగర్వాల్ వరుస ఆఫర్లతో బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాజల్ నటించిన భారతీయుడు2 సినిమా షూటింగ్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోగా ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది.చిరంజీవితో కాజల్ కలిసి నటించిన ఆచార్య సినిమా మే నెల 13వ తేదీన విడుదల కావాల్సి ఉంది.