సూర్య జ్యోతికల 15వ పెళ్లిరోజు.. జ్యోతిక ఇచ్చిన బహుమతి ఏమిటంటే?

సూర్య జ్యోతిక జోడీకి ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.సినిమాల ద్వారా అటు సూర్య, ఇటు జ్యోతిక పాపులారిటీని అంతకంతకూ పెంచుకుంటున్నారు.అభినయంతో సూర్య, జ్యోతిక తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లతో బిజీ అవుతుండటం గమనార్హం.2006 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీన సూర్య, జ్యోతికలకు వివాహం జరిగింది.నిన్న సూర్య, జ్యోతిక వివాహ వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్నారు.

 200 Crore Rupees Huge Budget For Surya Movie , 15th Marriage Anniversary, 200 C-TeluguStop.com

వివాహ వార్షికోత్సవం సందర్భంగా జ్యోతిక సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు.

ప్రేక్షకుల ప్రేమ, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు అని జ్యోతిక వెల్లడించారు.తన చేతితో వేసిన సూర్య పెన్సిల్ స్కెచ్ ను, రెండు సింహాలు కౌగిలించుకుని ఉన్న మరో స్కెచ్ ను జ్యోతిక తన భర్త సూర్యకు అంకితమయ్యారు.

సూర్య తన భర్త కావడంతో పాటు సహనటుడని తనకు మరో అమ్మ అని ముఖ్యంగా తన బెస్ట్ ఫ్రెండ్ అని జ్యోతిక పేర్కొన్నారు.

గతేడాది ఆకాశమే నీ హద్దురా సినిమాతో సూర్య భారీ సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.

సూర్య ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెట్టారు.సూర్య ప్రస్తుతం నటిస్తున్న వాడివాసల్ మూవీ బడ్జెట్ ఏకంగా 200 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.

జాతీయ అవార్డును అందుకున్న వెట్రిమారన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

పీరియాడికల్ మూవీగా హరప్పా – సింధు నాగరికత బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.సూర్య ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తారని తండ్రీకొడుకులుగా సూర్య కనిపిస్తారని సమాచారం.ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.సూర్య ఈ మూవీతో సక్సెస్ తో పాటు అవార్డులు సాధిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube