నా అందానికి రహస్యం అదే : నటి జ్యోతిక

హీరోయిన్ జ్యోతిక( Jyothika )… ఈ పేరుకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.బాంబేలో పుట్టి పెరిగిన జ్యోతిక హీరోయిన్గా సౌత్ తో పాటు నార్త్ లో కూడా తనదైన ముద్ర వేసుకొని సౌత్ ఇండియాలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సూర్యతో ప్రేమాయణం కొనసాగించి, అతనితో జీవితాన్ని పంచుకొని ఇద్దరు పిల్లలు తల్లిగా తన జీవితాన్ని ఎంతో అందంగా, ఆనందంగా కొనసాగిస్తుంది.

 Heroine Jyothika About Her Beauty , Heroine Jyothika, Surya, Film Industry, He-TeluguStop.com

పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ తనలోని టాలెంట్ కి సూర్య అడ్డుకట్ట వెయ్యలేదు.ఆమెను నటించమని చక్కగా ఎంకరేజ్ చేశాడు అందుకే ప్రస్తుతం ఆమె మెయిన్ లీడ్ గా అనేక సినిమాలు నటిస్తూ నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టింది.

ఒకవైపు ఇద్దరు పిల్లలకు తల్లిగా, మరో వైపు నటిగా, నిర్మాతగా ఆమె తన అడుగులను చాలా జాగ్రత్తగా వేసుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తుంది.

Telugu Jyothika, Surya, Tollywood-Movie

అంతేకాదు హీరో సూర్య( Surya ) జీవితంలో అత్యంత ముఖ్యమైన స్థానంలో ఉన్న జ్యోతిక తన భర్త కెరియర్ కూడా చక్కగా ముందుకు వెళ్లడానికి తనదైన సహాయం అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇక సినిమా ఇండస్ట్రీలో( film industry ) కూడా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నా జ్యోతిక ఇటీవల జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ లో తన అందానికి గల రహస్యం ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా ఆమె నవ్వుతూ నా జీవితమంతా ఎంతో సంతోషంగా ఎప్పుడు నవ్వుతూ ఉన్నాను.అందుకే నేను ఇంత అందంగా ఉండగలిగాను అంటూ సమాధానం చెప్పి అందరిని నవ్వించింది.

ఆమె చెప్పిన సమాధానానికి స్టేజ్ కింద ఉన్న వారంతా చప్పట్లతో ఓ తమ హర్షాతిరేకాలను వ్యక్తం చేశారు.సూర్య తన భార్యకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు.

చాలామంది హీరోలు లాగా భార్యను వంటింటికే పరిమితం చేయకుండా ఆమెకు నచ్చిన పని చేసే విధంగా ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు.

Telugu Jyothika, Surya, Tollywood-Movie

తనుస్టార్ అయినప్పటికీ తన పిల్లలకు తల్లిగా ఉంటే చాలు అని సూర్య ఏ రోజు అనుకోలేదు అందుకే ఆమె తన భర్త ఇచ్చిన ప్రేమకు ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది అందువల్లే ఆమె తన బ్యూటీని అలాగే కొనసాగించగలుగుతుంది జ్యోతిక లాంటి ఒక అదృష్టవంతురాలు మరెవ్వరూ ఉండరు.మొదట్లో ఎవరికి జ్యోతిక అంటే ఇంట్లో ఇష్టం ఉండేది కాదట.కానీ ఆమె తన సత్ప్రవర్తనతో అందరి మనసులను గెలుచుకొని ప్రస్తుతం ఇంటికి ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చే కోడలిగా ఇల్లు చక్కబెడుతూనే సినిమాలను చేస్తుంది నిజంగా జ్యోతిగా కి హాట్సాఫ్ చెప్పకుండా ఉండలేము కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube