ఆయన ముస్లిం నేను బ్రాహ్మణ్.. లవ్ స్టోరీ చెప్పిన ఇంద్రజ..?

ఒకప్పుడు తెలుగులో ఒక వెలుగు వెలిగి వేర్వేరు కారణాల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లకు వరుస అవకాశాలు వస్తున్నాయి.సెకండ్ ఇన్నింగ్స్ లో అలా వరుస అవకాశాలను సంపాదించుకుంటున్న హీరోయిన్లలో ఇంద్రజ ఒకరు.

 Heroine Indraja Revealed Her Love Story In An Interview,latest News-TeluguStop.com

మలయాళ నటి అయినప్పటికీ తెలుగులో ఇంద్రజ వరుస అవకాశాలను సొంతం చేసుకున్నారు.కేరళలో పుట్టిన ఈ నటి చెన్నైలో పెరిగారు.75 కంటే ఎక్కువ సినిమాల్లో ఈమె నటించారు.

ఇంద్రజ మంచి సింగర్ కూడా కావడం గమనార్హం.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇంద్రజ తన ప్రేమకథను వెల్లడించారు.తన భర్త ముస్లిం అని తాను తెలుగు బ్రాహ్మణ్ అని ఆసక్తికరమైన విషయాన్ని తెలిపారు.

రోజా కొన్ని కారణాల ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటూ ఉండటంతో ఇంద్రజ ప్రస్తుతం జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.ఇంద్రజ భర్త పేరు మహ్మద్ అబ్సర్ కాగా వేరే మతం వ్యక్తిని పెళ్లి చేసుకోవడం గురించి చెబుతూ మనస్సుకు నచ్చిన వ్యక్తి కావడంతో అతనిని పెళ్లి చేసుకున్నానని అన్నారు.

మనస్సుకు, మతంకు సంబంధం ఉండదని పెళ్లి తరువాత కూడా తాను బ్రాహ్మణ్ అమ్మాయిగానే ఉన్నానని ఇంద్రజ పేర్కొన్నారు.కులాన్ని మతాన్ని చూసి ఎవరినీ ఇష్టపడమని ఈ డైలాగ్ తన రియల్ లైఫ్ కు సూట్ అవుతుందని ఆమె వెల్లడించారు.

ఆరు సంవత్సరాలు తాను, అబ్సర్ స్నేహితులుగా ఉన్నామని కామన్ ఫ్రెండ్స్ ద్వారా తనకు పరిచయం ఏర్పడిందని ఆమె వెల్లడించారు.తన భర్తకు సినిమా రంగంలో కూడా మంచి సంబంధాలు ఉన్నాయని ఆమె తెలిపారు.

ఆయన యాడ్ ఫిల్మ్ మేకర్ కావడంతో పాటు రైటర్ అని ఆయన కొన్ని సినిమాల్లో కూడా నటించారని ఇంద్రజ వెల్లడించారు.వ్యాపారం కూడా చేస్తున్నారని ఆమె వెల్లడించారు.

తాను నటించే సినిమాల విషయంలో కూడా భర్త సలహాలు ఇస్తారని అయితే ఆయన పరిధి చాలా పరిమితంగా ఉంటుందని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube