గోవా బ్యూటీ ఇలియానా(Ileana) పెళ్లి కాకుండానే తల్లి కాబోతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ(Pragency) విషయాన్ని తెలియజేయడంతో ఒక్కసారిగా ఈ విషయం సంచలనంగా మారింది.ఇలియానా గతంలో ఓ వ్యక్తితో ప్రేమలో పడటం బ్రేకప్ చెప్పుకోవడం జరిగిందంటూ వార్తలు వచ్చాయి.
అయితే ఈమె తిరిగి నటి కత్రినా కైఫ్ సోదరుడుతో (Katrina Kaif Brother) ప్రేమలో ఉందంటూ కూడా వార్తలు వచ్చాయి.ఈ ప్రేమ గురించి సరైన అధికారిక ప్రకటన లేదని చెప్పాలి.
ఇక ఇలియానా పెళ్లి కాకుండా సోషల్ మీడియా వేదికగా తన ప్రేగ్నెన్సీ విషయాన్ని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.

ఇలా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావడం ఏంటి అని అందరూ ఆశ్చర్య పోవడమే కాకుండా ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ కూడా ఈమెను ప్రశ్నిస్తున్నారు.అయితే ఇలియానా మాత్రం ఆ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచుతూ తన ప్రేగ్నెన్సీకి సంబంధించిన విషయాలను మాత్రం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.ఈ విధంగా ఎప్పటికప్పుడు తన బేబీ బంప్ (Baby Bump)ఫోటోలను షేర్ చేయడమే కాకుండా తన ప్రెగ్నెన్సీ సమయంలో కలిగే అనుభూతులను కూడా ఈమె సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంటున్నారు.

ఇకపోతే రెండు రోజుల క్రితం ఈమె సోషల్ మీడియా వేదికగా తన చేతితో పాటు మరో వ్యక్తి చేయి ఉన్న ఫోటోలను షేర్ చేశారు.ఈ ఫోటోలు వైరల్ కావడంతో బహుశా ఈమె పెళ్లి చేసుకున్నారేమో అంటూ సందేహాలను వ్యక్తం చేశారు.అయితే తాజాగా మరోసారి ఈమె సోషల్ మీడియా వేదికగా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు కారణమైనటువంటి వ్యక్తి గురించి చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా ఈమె స్పందిస్తూ తల్లి కావడం గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చారు.
మన శరీరంలో ఓ బిడ్డకు ప్రాణం పోయడం గొప్ప అనుభూతిని పంచిందని చెప్పారు.ఇక తన కష్టాలలో ఓ వ్యక్తి తనకు తోడుగా నిలిచి, ఆ వేదన నుంచి తనని బయటపడేసారని, తన జీవితంలో నవ్వులు పూయించి తన జీవితాన్ని అందంగా మార్చాడు అంటూ ఈమె ఆ వ్యక్తి గురించి చెప్పుకొచ్చిన ఆ వ్యక్తి ఎవరు అనే విషయాన్ని మాత్రం సస్పెన్స్ గా పెట్టారని చెప్పాలి.
ప్రస్తుతం ఇలియానా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.