ఈ మధ్య సినిమాలకు కొత్త కొత్త నటులు పరిచయమవుతున్నారు.ఈ లాక్ డౌన్ తర్వాత సినిమాలకు సంబంధించిన వార్తలు రోజు వస్తూనే ఉన్నాయి.
అంతేకాకుండా ఇటీవలే సినిమా హాల్స్ తెరుచుకోగా మొదటి తరహాలో ఉన్నంత క్రేజ్ మళ్లీ వస్తుంది.అంతేకాకుండా కొత్త కథలతో విడుదల అవుతున్న సినిమాలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి.
జనవరి 23న మరో కొత్త సినిమా “నాట్యం” ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేసిన మరో పెద్దింటి కోడలు కొణిదెల ఉపాసన.
అసలు ఉపాసనకు సినిమాల్లో సంబంధం ఏంటి అనుకుంటున్నారా.కారణం ఆ సినిమా లో నటించిన నటి ఓ పెద్దింటి కోడలట.
అందుకే ఆ పెద్దింటి కోడలు ఈ పెద్దింటి కోడలి లుక్ ను విడుదల చేసింది.
ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా.ఆమె పేరు సంధ్య రాజు.బహుశా ఈ పేరు ఎక్కడ వినలేదనే ఆలోచన మీకు రావచ్చు.కానీ ఆమె ఎవరో కాదు.సత్యం రామలింగరాజు కోడలు.ఇప్పుడు గుర్తొచ్చిందా.అదేనండోయ్ రామలింగరాజు కుమారుడు రామరాజు భార్యనే సంధ్య రాజు.
ఈమెకు మెట్టింటి నుండే కాకుండా.పుట్టింటి నుండి కూడా ఓ పెద్దింటి బిడ్డనే.
ఓ భారీ సిమెంట్ సంస్థ అధికారి బిడ్డ.
సంధ్య రాజు ఇదివరకే మలయాళ సినిమాలో నటించిందట.
సమంత నటించిన యూటర్న్ సినిమా ఆధారంగా మలయాళంలో కేర్ ఫుల్ సినిమా లో సంధ్యా రాజు నటించింది.ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని సాధించుకుంది.
కాగా సంధ్య కు నాట్యం రెండవ సినిమా అవుతుంది.ఇదిలా ఉంటే సంధ్య కు నాట్యం పట్ల ఎక్కువ ఆసక్తి ఉండేదట.
దీంతో ఆమె నాట్యం ను నేర్చుకొని.తను సోషల్ మీడియాలో ప్రదర్శనలు చేసిన వీడియోలను ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ముందు ఉంటుంది.