మెగాస్టార్ 154 లో హీరోయిన్ ఫిక్స్... చిరంజీవి సరసన జతకట్టనున్న శృతిహాసన్!

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

 Heroine Fix In Megastar 154 Shrutihaasan To Be Paired With Chiranjeevi Hiranjeev-TeluguStop.com

అలాగే మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు, ఈ సినిమాలకు మోహన్ రాజా, మెహర్ రమేష్ దర్శకులుగా పని చేస్తున్నారు.ఇకపోతే మెగాస్టార్ తన 154 వ చిత్రాన్ని బాబి దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.

ఇప్పటికే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పనులు జరుపుకుంటుంది.

ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడానికి దర్శకులు హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన నటి శృతిహాసన్ నటించబోతుందని గతకొద్ది రోజులనుంచి పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్రబృందం మెగాస్టార్ 154 సినిమాలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది అంటూ అధికారికంగా ప్రకటించారు.

Telugu Chiranjeevi, Shruti Hassan, Tollywood-Movie

ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేశారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ ఆహ్వానిస్తూ తన నివాసంలో ఆమెకు ఒక బోకే ఇచ్చి స్వాగతం పలికారు.అలాగే ట్విట్టర్ ద్వారా ఇదే విషయాన్ని చిరంజీవి వెల్లడించారు.మహిళా దినోత్సవం సందర్భంగా మీకు స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది శృతిహాసన్.మెగా 154 లోకి రావడం వల్ల సినిమాకి స్త్రీశక్తి తోడు కాబోతుందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ప్రస్తుతం శృతి హాసన్ చిరంజీవితో కలిసి దిగిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే శృతిహాసన్ బాలకృష్ణ సరసన కూడా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube