రాజమౌళి డైరక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ఛత్రపతి.ఈ సినిమాను హిందీ లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్నారు.ఈ రీమేక్ సినిమాను వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు.పెన్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామని తీసుకోవాలని అనుకున్నారు కాని అక్కడ హీరోయిన్స్ ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు.
అందుకే సౌత్ హీరోయిన్స్ నే తీసుకోవాలని అనుకున్నారు.
ఫైనల్ గా సౌత్ భామల్లో రెజినాని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.
తెలుగులో పెద్దగా అవకాశాలు లేని రెజినా ప్రస్తుతం వెబ్ సీరీస్ లు చేస్తూ కెరియర్ కొనసాగిస్తుంది.ఇక ఇప్పుడు బెల్లంకొండ బాబు ఛత్రపతి రీమేక్ లో ఆమె ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది.
హిందీలో ఛత్రపతిలో తన గ్లామర్ తో ఆడియెన్స్ ను బుట్టలో వేసుకోవాలని చూస్తుంది రెజినా.రాక రాక వచ్చిన ఛాన్స్ కాబట్టి సినిమాలో గ్లామర్ షోతో కూడా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.
సినిమాలో నటించేందుకు అమ్మడికి భారీ రెమ్యునరేషన్ ఇస్తున్నట్టు టాక్. బాలీవుడ్ లో ఈ లక్కీ ఛాన్స్ తో రెజినా అక్కడ కూడా తన సత్తా చాటాలని చూస్తుంది.
అమ్మడికి ఇది నిజంగానే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పొచ్చు.