ఎన్టీఆర్ కు నో చెప్పిన దీపికా... అసలు మ్యాటర్ ఇదే?

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఆర్ఆర్ఆర్ ఈ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి చిత్రంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

 Deepika Says No To Ntr Do You Know What Is The Reason Details, Deepika, Bollywood, Jr Ntr, Tollywood, Telugu Film Industry, Deepika Padukone, Deepika Padukone Ntr, Ntr30, Director Koratala Shiva, Ananya Panday, Ntr Ananya Panday-TeluguStop.com

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ తన 30 వ సినిమాని మొదలు పెట్టబోతున్నారు.జనతా గ్యారేజ్ సినిమా తరువాత మళ్లీ కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రాబోతోంది.

ఆర్ఆర్ఆర్ హిట్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఆచార్య సినిమాతో ఫ్లాప్ ను అందుకున్న దర్శకుడు కొరటాల శివతో కలిసి చేస్తున్న సినిమా ఇది.ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

 Deepika Says No To Ntr Do You Know What Is The Reason Details, Deepika, Bollywood, Jr Ntr, Tollywood, Telugu Film Industry, Deepika Padukone, Deepika Padukone Ntr, Ntr30, Director Koratala Shiva, Ananya Panday, Ntr Ananya Panday-ఎన్టీఆర్ కు నో చెప్పిన దీపికా#8230; అసలు మ్యాటర్ ఇదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాకు అనిరుథ్ మ్యూజిక్ అందిస్తుండగా రత్నవేలు కెమెరామెన్ గా పనిచేస్తున్నారు.కాకపోతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నది ఇప్పటి వరకు తెలియలేదు.మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని ఎంపిక చేయబోతున్నారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించడానికి ముందుగా ఆలియాభట్ అనుకున్నప్పటికీ ఆమె ఈ సినిమాను చేయడానికి ఒప్పుకోలేదట.

దీనితో దర్శక నిర్మాతలు ఈ సినిమా కోసం హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డారట.ఈ క్రమంలోనే కియారా అద్వానీ, జాన్వీ కపూర్,సాయి పల్లవి, అనన్య పాండే, కీర్తి సురేష్ పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

వీరే కాకుండా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునేని కూడా సంప్రదించగా ఆమె ఈ సినిమాకు నో చెప్పినట్టు ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.ఇక తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం దీపికా పదుకొనేను అసలు సంప్రదించలేదట.అయితే సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు అన్నీ పుకార్లే అంటూ కొట్టిపారేస్తున్నారు.కాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండేను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

మరి ఎన్టీఆర్ సరసన నటించే అవకాశం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే దక్కుతుందా లేకపోతే మరెవరైనా హీరోయిన్ ను సెలెక్ట్ చేస్తారా అన్నది చూడాలి మరి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube