సైడ్ డాన్సర్ గా కెరియర్ స్టార్ చేసి హీరోయిన్ అయిన అందాల భామ

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ కెరియర్ చాలా వెరైటీగా స్టార్ట్ అవుతుంది.రవితేజ, నాని, రాజ్ తరుణ్ లాంటి హీరోలు అసిస్టెంట్ దర్శకులుగా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోలుగా టర్న్ తీసుకొని తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.

 Heroine Chitra Shukla Started Career As A Side Dancer, Tollywood, Telugu Cinema,-TeluguStop.com

అలాగే హీరోయిన్స్ కూడా చాలా మంది కెరియర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ తరువాత తమ ఐడెంటిటీ చూపించుకున్నారు.అలంటి మేటి నటి వాణిశ్రీ సైడ్ క్యారెక్టర్స్ తో కెరియర్ ప్రారంభించి తరువాత స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

అలాగే నయనతార, త్రిష లాంటి స్టార్ హీరోయిన్స్ కూడా కెరియర్ ఆరంభంలో ఫ్రెండ్ పాత్రలు, చిన్న చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ చేసి తరువాత హీరోయిన్స్ గా టర్న్ తీసుకొని సక్సెస్ అందుకున్నారు.అలాగే ముమైత్ ఖాన్ సినిమాలలో సైడ్ డాన్సర్ గా కెరియర్ ఆరంభించి తరువాత ఐటెమ్ భామగా గుర్తింపు తెచ్చుకుంది.

అలాగే ఈ తరంలో మరో నటి అలాగే సైడ్ డాన్సర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోయిన్ అయ్యింది.ఇప్పుడు వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది.

ఆ భామ చిత్ర శుక్లా.ఈ అమ్మడు నేను శైలజ సినిమాలో ఓ పబ్ సాంగ్ లో డాన్సర్ గా అలా మెరిసి మాయం అవుతుంది.

అయితే అప్పటికే ఈ అమ్మడు మోడలింగ్ లోకి అడుగుపెట్టి యాడ్స్ చేస్తూ ఉంది.అందం, అభినయం ఉన్న ఈ అమ్మడు తరువాత మా అబ్బాయి అనే సినిమాతో శ్రీవిష్ణుకి జోడీగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.తరువాత రాజ్ తరుణ్ తో రంగులరాట్నం సినిమా చేసింది.

ఆ సినిమాతో ఓ మోస్తరు గుర్తింపు తెచ్చుకుంది.తరువాత అల్లరి నరేష్ కి జోడీగా సిల్లీ ఫెలోస్ సినిమాలో సందడి చేసింది.

ప్రస్తుతం శ్రీసింహ హీరోగా తెరకెక్కిన తెలవారితే గురువారం సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ ఉండటంతో తన కెరియర్ కి టర్న్ అవుతుందని ఈ భామ ఆశిస్తుంది.

మరి చిత్ర శుక్లా టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ అవుతుందో లేదో వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube