ఐదుగురిని ఒప్పుకున్న హీరోయిన్.! అవకాశాల కోసం అంతకు దిగజారింది కానీ     2018-06-15   00:56:14  IST  Raghu V

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకొవలనే సామెత సినిమా వాళ్లకి కరెక్ట్ గా అవునియోతుంది..అవకాశాలున్నప్పుడే సద్వినియోగం చేసుకుని నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి..లేకపోతే తంటాలు తప్పవు… అప్పటివరకూ లగ్జరీ లైఫ్ బతికి ఒక్కసారిగా అవకాశాలు లేక,చేతిలో డబ్బులేక అడ్డదారులు తొక్కిన కథానాయకులు నాయికలు ఎందరో..ఇలాగే అడ్డదారి తొక్కిన మరో వర్ధమాన నటి కూడా ఇప్పుడు జైలు పాలైంది.

ఆడి పొన్ అవణి’ అనే తమిళ సినిమాలో హీరోయిన్‌గా నటించిన శ్రుతికి మంచి గుర్తింపే ఉంది. వర్థమాన నటిగా తమిళ ఇండస్ట్రీలో ఆమె చాలామందికి సుపరిచితమే. కానీ అవకాశాల్లేక కెరీర్ ఢీలా పడడంతో.. డబ్బు కోసం అడ్డదారులు తొక్కింది. కొంతమంది యువకులకు మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా వలవేసింది. పెళ్లి పేరుతో వాళ్లకు దగ్గరైంది.దగ్గరయ్యాక ఏదో ఒక కారణం చెప్పి డబ్బు అడిగేది.. ఎలాగూ కాబోయే భార్యే కదా.. అని ఆమె అడిగిన ప్రతీసారి వాళ్లు లక్షలకు లక్షలు సమర్పించుకున్నారు. అలా నలుగురైదురు యువకులను శ్రుతి మోసం చేసింది.