స్వీటీని తెగ మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఎందుకంటే..?

Heroine Anushka Shetty Comments About Corona Virus,latest News

దేశంలో రోజురోజుకు కరోనా విజృంభణ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.కరోనా విజృంభణ వల్ల సెలబ్రిటీలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావడంతో వైరస్ తమకు సోకకుండా ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు.

 Heroine Anushka Shetty Comments About Corona Virus,latest News-TeluguStop.com

స్టార్ హీరోయిన్ అనుష్క నెటిజన్లకు కరోనాకు సంబంధించి కీలక సూచనలు చేశారు.అనుష్క తన పోస్ట్ ద్వారా ప్రజల్లో కరోనాపై నెలకొన్న భయాన్ని తొలగించే ప్రయత్నం చేశారు.

కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రస్తుతం భారత్ లో ఏ విధమైన పరిస్థితులు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అనుష్క అన్నారు.ఆక్సిజన్ కొరత వల్ల ఎంతోమంది ప్రాణాలను కోల్పోతున్నారని అనుష్క పేర్కొన్నారు.

సరైన వైద్యం అందకపోవడం వల్ల మరి కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆమె వెల్లడించారు.ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కేసులు నమోదు కావడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని అనుష్క పేర్కొన్నారు.

కరోనా విజృంభణ వల్ల ఏర్పడిన కష్ట కాలంలో ప్రజలు మంచిగానే ఉన్నారని తాను అనుకుంటున్నానని అనుష్క చెప్పుకొచ్చారు.ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమనిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అనుష్క పేర్కొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో మనకు మనం సహాయం చేసుకోవాలని ఆమె వెల్లడించారు.ఇంటికే పరిమితమే స్వీయ నిర్భంధం విధించుకుంటే మందని అనుష్క ప్రజలకు సూచనలు చేశారు.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ వాళ్లతో వీలైనంత సమయం గడపాలని ఆమె పేర్కొన్నారు.శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను తప్పనిసరిగా చేయాలని అనుష్క పేర్కొన్నారు.కరోనా కష్ట కాలంలో ప్రజలకు ప్రయోజనం చేకూరే సలహాలు, సూచనలు ఇచ్చిన అనుష్కను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.అనుష్కలా ఇతర సెలబ్రిటీలు సైతం కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు కరోనా వ్యాక్సిన్ గురించి ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తే మంచిదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube