ఆ మాట అడగడమే తప్పంటున్న అనుపమ..?

అ ఆ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో బిజీ అవుతోంది అనుపమ పరమేశ్వరన్.గతేడాది రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టిన అనుపమ నటించిన ఒక్క సినిమా కూడా ఈ ఏడాది విడుదల కాలేదు.

 Heroine Anupama Parameswaran Interesting Comments About Her Marriage, 18 Pages M-TeluguStop.com

అయితే వచ్చే ఏడాది మాత్రం అనుపమ హీరోయిన్ గా నటించిన మూడు సినిమాలు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.ప్రస్తుతం అనుపమ నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న 18 పేజెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తొంది.

దిల్ రాజు బంధువు అషిష్ రెడ్డి హీరోగా తెరకెక్కబోయే ఒక సినిమాలో అనుపమ హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం.ఈ సినిమాకు రౌడీ బోయ్స్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన హెలెన్ సినిమాలో తెలుగులో రీమేక్ అవుతుండగా ఈ సినిమాలో కూడా అనుపమనే హీరోయిన్ గా ఫైనలేజ్ చేసినట్టు సమాచారం.

Telugu Pages, Mall-Movie

స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వకపోయినా మిడిల్ రేంజ్ హీరోలు, యంగ్ హీరోలు అనుపమకు అవకాశాలు ఇస్తూ ఉండటం గమనార్హం.ఇటీవల ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కు హాజరైన అనుపమకు పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.లాక్ డౌన్ సమయంలో చాలామంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవడంతో అనుపమకు కూడా పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా తన పెళ్లి గురించి అడగడమే తప్పు అంటూ అనుపమ సంచలన వ్యాఖ్యలు చేసింది.

తాను ఇంకా చిన్న అమ్మాయినేనని ఇప్పుడే పెళ్లి చేసుకోనని అనుపమ వెల్లడించారు.అయితే అనుపమ తెలుగులోనే మాట్లాడటం గమనార్హం.అందం, అభినయం పుష్కలంగా ఉన్న అనుపమ కెరీర్ లో హిట్లు సాధించినా భారీ బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో లేకపోవడం ఆమెకు మైనస్ గా మారుతోంది.అనుపమ నటించబోయే సినిమాలు హిట్లైతే మాత్రం ఆమె మళ్లీ వరుస ఛాన్సులతో బిజీ అయ్యే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube