టీచర్ ట్రైనింగ్ ఎగ్జామ్స్ రాసిన అనుపమ పరమేశ్వరన్  

Heroine Anupama Parameswaran Hall Ticket Viral In Social Media-heroine Anupama Parameswaran,tollywood,viral In Social Media

చిన్న వయసులో ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఆడుకు పెట్టి తరువాత చదువులు కొనసాగించిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు.కెరియర్ సక్సెస్ అయిన తర్వాత చదుకునే అవకాశం లేకపోవడంతో ఎడ్యుకేషన్ కి దూరమైనా వారు కూడా ఉన్నారు.

Heroine Anupama Parameswaran Hall Ticket Viral In Social Media-Heroine Tollywood Media

ఇలా ఈ కోవలోనే ఇంటర్ మీడియట్ చదువుతున్న టైంలోనే ప్రేమమ్ సినిమాతో మలయాళీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టి తరువాత తెలుగులో కూడా హీరోయిన్గా వరుస సినిమాలు చేసిన ముద్దుగుమ్మ అనుపమా పరామేశ్వరన్.టాలెంట్ ఉన్నా కూడా సరైన హిట్ లేకపోవడంతో దర్శకులు ఈ భామని ప్రస్తుతం పక్కన పెట్టారు.

దీంతో ఆగిపోయిన చదువుని అనుపమ కొనసాగిస్తుంది.

ఇదిలా ఉంటే తాజాగా బీహార్ లో టీచర్ ట్రైనింగ్ కి పరీక్షకి సంబందించిన హాల్ టికెట్ లో అనుపమా పరమేశ్వరన్ ఫోటో వచ్చింది.

దీంతో కేరళలో చదువుతున్న ఈ భామ బీహార్ లో పరీక్ష రాయడం ఏంటి అని కాస్తా షాక్ అయ్యారు.అయితే అసలు విషయం తెలిసిన తర్వాత బీహార్ ఎడ్యుకేషన్ బోర్డు ఉపశమన చర్యలు మొదలెట్టింది.

బీహార్ లో నిర్వహిస్తున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ హాల్ టికెట్లో ఓ యువకుడి ఫోటోకు బదులు అనుపమ ఫోటో వచ్చింది.రిషికేశ్ కుమార్ టీచర్ పోస్ట్ కు అర్హత సాధించేందుకు ఎస్ టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ నెల 28న జరిగే పరోక్ష కోసం ఆన్ లైన్ లో హాల్ టికెట్లు బోర్డు విడుదల చేసింది.హాల్ టికెట్ లో రిషికేశ్ కి బదులు అనుపమ ఫోటో ఉంది.

దీనిపై అతను వెంటనే అధికారులను సంప్రదించాడు.అధికారులు తప్పుని గుర్తించి సరిచేశారు.అయితే ఈ హాల్ టికెట్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.

తాజా వార్తలు

Heroine Anupama Parameswaran Hall Ticket Viral In Social Media-heroine Anupama Parameswaran,tollywood,viral In Social Media Related....