అలాంటి పాత్రల్లో ఎప్పటికీ నటించనంటున్న యంగ్ హీరోయిన్..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా వరుస అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే గ్లామర్ రోల్స్ లో నటించాలనే సంగతి తెలిసిందే.అయితే కొందరు హీరోయిన్లు మాత్రం గ్లామర్ పాత్రల్లో నటించకపోయినా హీరోయిన్లుగా సక్సెస్ అయ్యారు.

 Heroine Anjana Keerti Says No To Glamorous Roles-TeluguStop.com

అయితే ఒకహీరోయిన్ మాత్రం తాను భవిష్యత్తులో కూడా గ్లామర్ పాత్రల్లో నటించబోనని వెల్లడించారు.కథ డిమాండ్ చేస్తే గ్లామర్ పాత్రల్లో నటిస్తానని ఆమె చెప్పినట్టు వార్తలు వైరల్ కావడంతో ఆమె స్పష్టతనిచ్చారు.

కోలీవుడ్ లో అళగియ పాండిపురం సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అంజనా కీర్తి గ్లామర్ పాత్రలు, శృంగార సన్నివేశాల గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం అంజనా కీర్తి శింబు హీరోగా తెరకెక్కుతున్న మానాడు సినిమాలో నటిస్తున్నారు.

 Heroine Anjana Keerti Says No To Glamorous Roles-అలాంటి పాత్రల్లో ఎప్పటికీ నటించనంటున్న యంగ్ హీరోయిన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అతి త్వరలో మానాడు సినిమా థియేటర్లలో విడుదల కానుండగా ఈ సినిమా హిట్ కావడంతో పాటు తన పాత్రకు మంచి పేరు వస్తుందని అంజనా కీర్తి భావిస్తున్నారు.

Telugu Glamorous Roles, Heroine Anjana Keerti, Maanadu Movie, Young Heroine-Movie

ఇప్పటివరకు అంజనా కీర్తి హీరోయిన్ గా నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని పొందలేదు.నటిగా మంచి పేరు తెచ్చుకోవాలని తాను భావిస్తున్నానని నటిగా మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని అంజనా కీర్తి అన్నారు.అయితే శృంగార సన్నివేశాల్లో మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లోనూ నటించబోనని ఆమె తేల్చి చెప్పారు.

కోలీవుడ్ మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆమె అన్నారు.

తాను చెప్పినట్టు వైరల్ అయిన స్టేట్ మెంట్ లో అసత్యమని పేర్కొన్నారు.

గ్లామర్ పాత్రల్లో నటించకుండా అంజనా కీర్తి స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంటారో లేదో చూడాల్సి ఉంది.అయితే కొందరు సినీ విశ్లేషకులు మాత్రం గ్లామర్ పాత్రలకు పూర్తిగా దూరంగా ఉంటే మాత్రం అవకాశాలు అంత తేలికగా రావని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

#HeroineAnjana #Glamorous Roles #Young Heroine

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు