ఆ విషయంపై క్లారిటీ ఇచ్చిన తెలుగు బ్యూటీ అంజలి

టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలకు పెద్దగా అవకాశాలు రావు అనేది ఎప్పటి నుంచో వినిపిస్తున్న విమర్శ.ఈ నేపథ్యంలోనే చాలామంది తెలుగు హీరోయిన్లు టాలీవుడ్ లో కంటే కోలీవుడ్లో ఎక్కువగా సక్సెస్ అయ్యారు కూడా.

 Heroine Anjali Interesting Comments On Competition In Tollywood, Tollywood, Vake-TeluguStop.com

తెలుగు సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ అంటే గ్లామర్ క్లీన్ గానే కనిపిస్తుంది.నటనకు అవకాశం ఉన్న పాత్రలు హీరోయిన్స్ కి చాలా అరుదుగా వస్తాయి.

హీరోలకు ఉన్న ప్రాధాన్యత టాలీవుడ్ హీరోయిన్స్కు ఉండదనే చెప్పాలి.ఈ కారణంగానే తెలుగు అమ్మాయిలు ఎక్కువగా టాలీవుడ్లో రాణించలేక పోతున్నారు అనేది చాలా మంది చెప్పిన మాట.ఎప్పుడో 15 ఏళ్ల క్రితం హీరోయిన్ గా పరిచయమైన అంజలి కూడా తెలుగులో లో కెరీర్ ఆరంభంలో అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది.అయితే కోలీవుడ్ లోకి వెళ్లి అక్కడ సక్సెస్ అయిన తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మరల తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి తాను ఎంత బెస్ట్ నటిని అనే విషయాన్ని ప్రూవ్ చేసుకుంది.

ఆ సినిమా తర్వాత కూడా అంజలికి తెలుగులో అనుకున్న స్థాయిలో స్టార్ హీరోయిన్ కాలేకపోయిన అప్పుడప్పుడు రవితేజ బాలకృష్ణ లాంటి స్టార్స్ తో జత కట్టి టాలీవుడ్ లో తన ఐడెంటిటీ చూపించుకుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ మంది కొత్త కథానాయికలకు అవకాశాలు వస్తున్నాయి.

Telugu Anjali, Kollywood, Seetammavakitlo, Telugu, Tollywood, Vakeel Saab-Movie

ఈ నేపథ్యంలో అంజలి హీరోయిన్ రేసులో వెనకబడిపోయింది అనే టాక్ ప్రచారంలోకి వచ్చింది.దీనిపై తాజాగా ఈ బ్యూటీ క్లారిటీ ఇచ్చింది.ఇండస్ట్రీలో హీరోయిన్స్ మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఉండదని ఎవరి అవకాశాలు ఉంటాయని పేర్కొంది.నటిగా మన సామర్థ్యం మనకి అవకాశాలు తెచ్చి పెడుతుందని అని వ్యాఖ్యానించింది.

తను ఇతర హీరోయిన్లతో కూడా స్క్రీన్ షేర్ చేస్తున్నాను.ఎప్పుడు కూడా వారు తనకు పోటీ అని భావించలేదని చెప్పింది.

కొత్త పాత హీరోయిన్స్ నుంచి ఎప్పుడు కూడా ఏదో ఒకటి నేర్చుకుంటూ తన నటన మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాననీ అంజలి చెప్పడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube