పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన అంజలి.. అప్పుడే చేసుకుంటానంటూ..?

తెలుగమ్మాయిలకు తెలుగులో దర్శకనిర్మాతలు ఎక్కువగా అవకాశాలు ఇవ్వరని చాలామంది తెలుగు హీరోయిన్లు చెబుతుంటారు.అయితే కొందరు తెలుగు హీరోయిన్లు మాత్రం తెలుగులో సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంటూ ఆ ప్రచారంలో నిజం లేదని ప్రూవ్ చేస్తూ ఉంటారు.

 Heroine Anjali Interesting Comments About Marriage, Anajali Marriage, Heroine An-TeluguStop.com

ఫోటో అనే చిన్న సినిమాతో 16 సంవత్సరాల క్రితం హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టిన అంజలి తెలుగుతో పాటు తమిళంలో కూడా అవకాశాలు పొందుతున్నారు.

తమిళ హీరో జైతో ప్రేమాయణం ద్వారా వార్తల్లో నిలిచిన అంజలి కొన్ని కారణాల వల్ల జైతో విడిపోయారు.

అయితే వీళ్లిద్దరూ విడిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు.వకీల్ సాబ్ సినిమాలో ముస్లిం యువతి పాత్రతో అంజలి మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు.తెలుగులో కెరీర్ తొలినాళ్లలో నటించిన సినిమాలు హిట్ కాకపోవడంతో అంజలి ఇతర సినీ ఇండస్ట్రీలపై దృష్టి పెట్టి ఆ ఇండస్ట్రీలలో విజయాలను సొంతం చేసుకుని టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చారు.

Telugu Anajali, Anjali, Offers-Movie

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో సీత పాత్ర అంజలి కెరీర్ లోనే మరపురాని పాత్రల్లో ఒకటిగా నిలిచింది.ఆ సినిమా తరువాత బలుపు, గీతాంజలి సినిమాలతో అంజలి విజయాలను సొంతం చేసుకున్నారు.లాక్ డౌన్ సమయంలో కొంతమంది హీరోయిన్లు పెళ్లి చేసుకోగా అంజలి మాత్రం ఇప్పట్లో పెళ్లొ చేసుకోనని వెల్లడించారు.

ప్రస్తుతం తాను కెరీర్ పైనే పూర్తిగా దృష్టిగా పెట్టానని అంజలి పేర్కొన్నారు.ప్రస్తుతం పెళ్లి గురించి తనకు ఆలోచన లేదని చెప్పారు.

హీరోయిన్ గా ఆఫర్లు తగ్గిన తరువాతే పెళ్లి చేసుకుంటానంటూ అంజలి పరోక్షంగా చెప్పడం గమనార్హం.ప్రస్తుతం అంజలి ఎఫ్3 సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

అనిల్ రావిపూడి అంజలి కోసం ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube