ప్లీజ్ మా అబ్బాయికి మీరే పేరు పెట్టండి: మహేష్ హీరోయిన్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి పెళ్లయ్యే వరకు కూడా వరుస అవకాశాలతో బిజీగా ఉన్న హీరోయిన్లలో అమృతా రావు ఒకరు.తెలుగులో మహేష్ బాబుకు జోడీగా అతిథి సినిమాలో నటించిన అమృతా రావు నటించింది ఒక్క సినిమానే అయినప్పటికీ ఆ సినిమా ద్వారా తెచ్చుకున్న గుర్తింపు అంతాఇంతా కాదు.

 Heroine Amrita Rao Requesting Fans For Suggesting Baby Name  Amrutharao, Radio J-TeluguStop.com

కొన్ని రోజుల క్రితం తాను 9 నెలల గర్భవతినని చెప్పి అభిమానులను ఆశ్చర్యపరచిన అమృతా రావు ఆదివారం రోజున పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.

రేడియో జాకీ అన్మోల్ ను ఏడు సంవత్సరాల పాటు ప్రేమించిన అమృతా రావు 2016లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

అయితే అమృతా రావు తన బాబుకు ఫ్యాన్స్ పేరు పెట్టాలని సోషల్ మీడియా వేదికగా కోరారు.అమృతా రావు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చేసిన పోస్ట్ లో తనకు బాబు పుట్టాడని.

బాబు, తను ఎంతో ఆరోగ్యంగా ఉన్నామని.తమపై ప్రేమను చూపిస్తున్న అభిమానులందరికీ ధన్యవాదాలని చెప్పారు.

అన్మోల్ తో 11 సంవత్సరాల రిలేషన్ షిప్ పూర్తైందని.తనకు బాబు రూపంలో మంచి బహుమతి దక్కిందని ఆమె తెలిపారు.బాబుకు పేరు పెట్టడానికి సలహాలు ఇవ్వాలని ఇన్స్టాగ్రామ్ వేదికగా అమృతా రావు కోరారు.దీంతో నెటిజన్లు తమకు నచ్చిన పేర్లను షేర్ చేస్తూ ఆ పేరే పెట్టాలని కోరుతున్నారు.

అమృతారావు షేర్ చేసిన ఈ పోస్ట్ కు దాదాపు 65,000 లైకులు వచ్చాయి.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అతిథి సినిమాలో అమృతా రావు హీరోయిన్ గా నటించగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని అందుకుంది.

ఆ సినిమా హిట్టై ఉంటే అమృతా రావుకు టాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం హీరోయిన్ గా వరుస అవకాశాలు దక్కేవి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube