అందుకే విడాకులు తీసుకున్నా.. అసలు విషయం చెప్పేసిన అమలా పాల్..!

తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాల్లో నటించి పేరు, గుర్తింపును సంపాదించుకున్నారు అమలా పాల్.తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా అమలా పాల్ స్టార్ హీరోల సినిమాల్లోనే నటించి మెప్పించారు.

 Heroine Amala Paul Shocking Comments About Her Divorce-TeluguStop.com

అయితే ప్రముఖ దర్శకుడు ఏఎల్ విజయ్ ను వివాహం చేసుకుని కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్న అమలాపాల్ ఎందుకు విడాకులు తీసుకున్నారో కచ్చితమైన కారణం ఎవరికీ తెలియదు.

విడాకులు తీసుకున్న తరువాత ఒంటరి జీవితం గడుపుతూ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తున్న్ అమలా పాల్ నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన పిట్టకథలు వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో నటించారు.

 Heroine Amala Paul Shocking Comments About Her Divorce-అందుకే విడాకులు తీసుకున్నా.. అసలు విషయం చెప్పేసిన అమలా పాల్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పిట్టకథలు ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న అమలా పాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ తో విడాకులు తీసుకోవడం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.భర్తతో విభేదాలు రావడం వల్ల విడిపోవాలని తాను అనుకున్నానని కానీ అందరూ తనను భయపెట్టారని ఆమె అన్నారు.

Telugu A L Vijay, Amala Paul, Divorce, Shocking Comments-Movie

విడాకులు తీసుకోవాలని తాను తీసుకున్న నిర్ణయానికి ఎవరూ అండగా నిలబడలేదని.తన సంతోషం గురించి కానీ మానసిక సంఘర్షణ గురించి కానీ ఎవరూ పట్టించుకోలేదని అమలా పాల్ తెలిపారు.సినిమా అవకాశాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన అమలా పాల్ ఈ ఏడాది వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్నారు.అమలా పాల్ నటిస్తున్న మరికొన్ని సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి.

తెలుగులో దర్శకనిర్మాతలు అమలాపాల్ కు పెద్దగా ఆఫర్లు ఇవ్వకపోయినా తమిళ దర్శకనిర్మాతలు ఆఫర్లు ఇస్తూ ఉండటం గమనార్హం.ప్రస్తుతం అమలా పాల్ నటిస్తున్న సినిమాలు హిట్టైతే ఆమెకు కొత్త సినిమా ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

పెళ్లి తరువాత సినిమాలకు కొంత దూరంగా ఉన్నా అమలా పాల్ మళ్లీ వరుస ఆఫర్లతో బిజీ కావడం గమనార్హం.

#Amala Paul #A L Vijay #Divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు