15 ఏళ్ల వయస్సులోనే ఈ నటికి అలాంటి కష్టాలు.. ఏమైందంటే?

తెలుగు, తమిళ భాషల్లో నటిగా ఐశ్వర్య రాజేష్ తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు.ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ వరుస సినిమా ఆఫర్లతో బిజీ అవుతున్న సంగతి తెలిసిందే.

 Heroine Aishwarya Rajesh Comments About Her Career Struggles And Cinema Entry, 1-TeluguStop.com

యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన ఐశ్వర్య రాజేష్ తక్కువ సమయంలోనే నటిగా ఎదిగి పాపులారిటీని ఊహించని స్థాయిలో పెంచుకున్నారు.అయితే టీవీ, సినిమా ఇండస్ట్రీలలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఐశ్వర్య రాజేష్ పడిన కష్టాలు అన్నీఇన్నీ కావు.

ఒక సందర్భంలో ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తాను సినీ కెరీర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.తనకు 8 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలోనే తండ్రి చనిపోయారని ఆమె అన్నారు.

ఆ తరువాత అమ్మ చిన్న బిజినెస్ చేయడంతో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏజెంట్ గా కూడా పని చేశారని ఐశ్వర్య అన్నారు.పెద్దన్న పది సంవత్సరాల వయస్సులో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారని రెండో అన్న కూడా చనిపోయారని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు.

ఊహించని కష్టాల వల్ల 15 సంవత్సరాల వయస్సులోనే కుటుంబ పోషణ భారం తనపై పడిందని ఆమె చెప్పుకొచ్చారు.

Telugu Rupees, Aiswarya Rajesh, Anchor, Supre-Movie

కుటుంబ పోషణ కొరకు 250 రూపాయల వేతనానికి సూపర్ మార్కెట్ లో పని చేశానని ఆ తర్వాత యాంకర్ గా ఈవెంట్లు చేస్తూ డబ్బులు సంపాదించనని ఆమె అన్నారు.ఆ తర్వాత సినిమాలు, సీరియళ్లలో చిన్నచిన్న పాత్రలు చేశానని ఐశ్వర్య రాజేష్ పేర్కొన్నారు.అవర్ గళ్ ఇవర్ గళ్ తను నటించిన తొలి సినిమా అని ఐశ్వర్య రాజేష్ అన్నారు.

Telugu Rupees, Aiswarya Rajesh, Anchor, Supre-Movie

నటిగా అట్టకత్తి మూవీ తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఐశ్వర్య రాజేష్ చెప్పుకొచ్చారు.కొంతమంది తాను హీరోయిన్ పాత్రకు అస్సలు సరిపోనని కామెంట్లు చేశారని అయితే స్టార్ హీరోయిన్ కావడమే లక్ష్యంగా పెట్టుకుని కెరీర్ ను కొనసాగిస్తున్నానని ఐశ్వర్య అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube