ఆ ఒక్క సినిమా వల్ల హీరోయిన్ అవకాశాలు పోయాయి.. అర్చన కామెంట్స్ వైరల్!

నేను, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఖలేజా మరికొన్ని సినిమాల ద్వారా అర్చన పాపులారిటీని సంపాదించుకున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో అర్చన మాట్లాడుతూ ఎన్నో కీలక విషయాలను వెల్లడించారు.

 Heroina Archana Shastri Shocking Comments About Nuvvostaantnte Nenoddantana Movi-TeluguStop.com

కొన్ని సినిమాలు చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని ఆమె అన్నారు.తాను ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చానని అర్చన చెప్పుకొచ్చారు.

నేను సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని అర్చన అన్నారు.

ఇండస్ట్రీలో చిరంజీవి, పవన్, మహేష్, నాగార్జున, మరి కొందరు హీరోలకు ఊహించని స్థాయిలో ఇమేజ్ ఉందని ఇండస్ట్రీలోకి తాను ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఇమేజ్ అనే వర్డ్ అర్థం అయ్యేది కాదని అర్చన వెల్లడించారు.

నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలో నా పాత్ర చిన్న పాత్ర అని ఆ సినిమా సక్సెస్ సాధించిందని అదే సమయంలో తాను కొంచెం టచ్ లో ఉంటే చెబుతా సినిమాలో కూడా చేశానని అర్చన పేర్కొన్నారు.

అయితే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా ఆడలేదని అర్చన వెల్లడించారు.

పరోక్షంగా నువ్వొస్తానంటే నేనొద్దంటానా తన కెరీర్ ను దెబ్బ కొట్టిందని అర్చన అన్నారు.

Telugu Archana, Archanasastri, Chiranjeevi, Archana Sastri, Judge, Nagarjuna, Si

తాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశానని కొన్ని సినిమాలలో తనను తీసేశారని అర్చన వెల్లడించారు.ఆ తర్వాత హీరోయిన్ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లు తనకు వచ్చాయని అర్చన అన్నారు.శ్రీరామదాసులోని సీత పాత్రకు చాలా మంచి గుర్తింపు వచ్చిందని అర్చన తెలిపారు.

Telugu Archana, Archanasastri, Chiranjeevi, Archana Sastri, Judge, Nagarjuna, Si

ఆట షోకు తాను జడ్జిగా వ్యవహరించడంపై కూడా నెగిటివ్ కామెంట్లు వినిపించాయని అర్చన అన్నారు.ఒక సమయంలో తాను అవకాశాల విషయంలో బాధ పడ్డానని అర్చన తెలిపారు.ఇప్పుడు తనకు ఆ బాధ కూడా లేదని అర్చన వెల్లడించారు.అర్చన ప్రస్తుతం పరిమిత సంఖ్యలో సినిమాల్లో నటిస్తున్నారు.అర్చన మళ్లీ నటిగా బిజీ అవుతారేమో చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube